Site icon OkTelugu

Tirumala Laddu Controversy: 2022 వ సంవత్సరంలో తిరుమల లడ్డూల నాణ్యత చూస్తే భక్తులకు రక్తం మరిగిపోతాది..ఆధారాలు ఇవే!

Tirumala Laddu

Tirumala Laddu

Tirumala Laddu Controversy: గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అని తేడా లేకుండా, ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి లడ్డు మ్యాటర్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2019 వ సంవత్సరం నుండి 2024 వ సంవత్సరం మధ్యలో భక్తులకు ఇచ్చిన లడ్డూ ప్రసాదం లో కల్తీ జరిగిందని కోర్టుకు SIT 300 పేజీల నివేదిక ఇచ్చింది. ఇంత స్పష్టంగా కల్తీ జరిగింది అనే విషయాన్ని SIT నివేదిక లో ఇస్తే, ఎక్కడ తమ వైసీపీ పార్టీ కి నష్టం కలుగుతుందో అనే భయంతో ఆ పార్టీ నాయకులూ పెద్ద ఎత్తున మేము తప్పు చేయలేదు, కల్తీ జరగలేదు, SIT అదే నివేదిక ఇచ్చింది, సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా భక్తులకు అబద్దాలు చెప్పి మోసాలు చేశారు, వాళ్ళు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ జగన్ దగ్గర నుండి పార్టీ నాయకుల వరకు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

అయితే దీనిని కూటమి నాయకులు కూడా సమర్థవతంగా ఉన్న వాస్తవాలను జనాలకు తెలుపుతూ కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ నాయకులను తిప్పి కొట్టారు. ఇప్పుడు ఈ SIT ఇచ్చిన నివేదిక ని నేషనల్ మీడియా కవర్ చేస్తోంది. దీని మీద డిబేట్స్ పెట్టి వైసీపీ పార్టీ ని ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇంకా తమ వైపు తప్పు లేదనే వాదన తీసుకొస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం లో TTD చైర్మన్ గా పని చేసిన వై వీ సుబ్బారెడ్డి మాత్రం తిరుమల లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యి లో కల్తీ జరిగింది అనే విషయం వాస్తవమే అని నేషనల్ మీడియా లో నోరు జారడం తో వైసీపీ పూర్తి స్థాయిలో డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.

అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు గత వైసీపీ హయం లో లడ్డూ నాణ్యత గురించి భక్తులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్స్ రూపం లో ఇచ్చిన ఫిర్యాదులను ఆధారాలతో సహా మళ్లీ బయటకు తీశారు. ఇది ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారిపోయింది. రసాయనాలు ఉపయోగించిన లడ్డూల ఆకారాలు ఎలా ఉన్నాయో ఈ క్రింది ట్వీట్ లో చూడండి. అవే లడ్డూలు కొన్ని రోజులకు పిండి పిండిగా మారిపోవడం వంటివి కూడా ఆ ఫోటోలో చూపించారు. ఇవన్నీ వై వీ సుబ్బా రెడ్డి దృష్టికి వెళ్లాయి. ల్యాబ్ లో టెస్టులు చేయగా, కల్తీ జరిగింది అంటూ రెండు రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కానీ వైసీపీ ఏ మాత్రం పట్టించుకోలేదు. అవే లాదూలను కొనసాగించింది. ఈ వాస్తవాలను చూసిన తర్వాత నెటిజెన్స్ వైసీపీ ని తీవ్ర స్థాయిలో తిట్టడం మొదలు పెట్టారు.

Exit mobile version