Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి టీమ్ కూడా తనదైన రీతిలో మ్యాచ్ లు ఆడుతూ గెలుపు దిశగా ముందుకు దూసుకెళుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే చిన్న జట్లు సైతం మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇప్పటికే ఈ టోర్నీ లో సగం మ్యాచులు ముగిశాయి.ఇక క్రమం లో సెమీస్ కి వెళ్లే జట్లు ఏవి అనే దాని మీద తీవ్రమైన చర్చ నడుస్తుంది. మొదటి మూడు ప్లేస్ లకి ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టీంలు బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకోగా, నెంబర్ ఫోర్ పొజిషన్ కోసం చాలా టీమ్ లు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఆ విషయం లో ఆస్ట్రేలియా టీమ్ ముందు వరుసలో ఉంది.ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా 3 మ్యాచ్ ల్లో గెలిచి 6 పాయింట్లతో నెంబర్ ఫోర్ లో కొనసాగుతుంది.
ఇక ఆస్ట్రేలియా రన్ రెట్ కూడా +1.142 గా ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా ఇక మీదట ఆడే 4 మ్యాచ్ ల్లో కనీసం మూడు మ్యాచ్ లు గెలిచింది అంటే చాలు ఈ టీమ్ పక్కగా సెమీస్ కి వెళ్తుంది…ఇక ఆస్ట్రేలియా తరువాత ఆడే మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ తో ఇవాళ్ళ ఆడుతుంది…కాబట్టి ఇక ఇంగ్లాండ్,ఆఫ్గనిస్తాన్,బంగ్లాదేశ్ టీమ్ లతో మ్యాచ్ లు ఆడనుంది.ఇక వీటిని ఆస్ట్రేలియా ఈజీగా ఓడిస్తుంది…
ఇక సెమీస్ బెర్త్ లో శ్రీలంక టీమ్ నిలవాలంటే ఆ టీమ్ ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్ లు గెలిచింది ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…శ్రీలంక ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడితే అందులో 2 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో 4 పాయింట్లతో ప్రస్తుతం శ్రీలంక 5 వ పొజిషన్ లో ఉంది. కాబట్టి ఈ టీమ్ సెమీస్ కి క్వాలిఫై కావాలంటే ఇక మీదట ఆడే 4 మ్యాచ్ లలో కూడా విజయం సాధించాలి. ఇక దానికి తోడు గా ఈ టీమ్ రన్ రేట్ అనేది మైనస్ లో ఉంది కాబట్టి దాన్ని ప్లస్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి లేకపోతే 4 మ్యాచ్ లు గెలిచిన ప్రయోజనం ఉండదు.శ్రీలంక వరుసగా ఆఫ్గనిస్తాన్ , ఇండియా, బంగ్లాదేశ్ ,న్యూజిలాండ్ టీమ్ లతో మ్యాచ్ లు అడల్సి ఉంటుంది…దీంట్లో ఇండియా, న్యూజిలాండ్ లను ఓడించడం కష్టం కానీ ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ల మీద కొంతవరకు శ్రీలంక పై చేయి సాధించవచ్చు…
ఇక పాకిస్థాన్ టీమ్ విషయానికి వస్తే ఆడిన మొదటి రెండు మ్యాచ్ ల్లో విజయాలను అందుకొని మూడోవ మ్యాచ్ లో ఇండియా తో ఆడి ఓడిపోయిన పాకిస్థాన్ టీమ్ ఇండియా కొట్టిన దెబ్బకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోలుకోవడం లేదు. ఇక ఇప్పటి వరకు పాకిస్థాన్ టీమ్ 6 మ్యాచు ఆడితే 2 మ్యాచ్ ల్లో గెలిచి మిగిలిన 4 మ్యాచ్ ల్లో భారీ పరాజయాన్ని పొందింది. ఇక ఇప్పుడు ఆడే 3 మ్యాచ్ ల్లో భారీ గా గెలిస్తే తప్ప పాకిస్థాన్ సెమీస్ లోకి రావడం కష్టం…ఇక పాకిస్థాన్ టీమ్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్,ఇంగ్లాండ్ టీమ్ లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది…
ఇక ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన ఆఫ్గనిస్తాన్ టీమ్ 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. అది కూడా పాకిస్థాన్, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్ల మీద విజయం సాధించి తమ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంది…ఇక అఫ్గాన్ టీమ్ కూడా సెమీస్ కి రావచ్చు. కానీ మ్యాచ్ లు గెలవడం తో పాటు గా రన్ రేట్ కూడా బాగా పెంచుకోవాల్సి ఉంటుంది…ఇక అఫ్గాన్ టీమ్ వరుసగా శ్రీలంక, నెదర్లాండ్, ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా లాంటి టీమ్ లతో ఆడాల్సి ఉంది. అయినప్పటికీ వాటిని మట్టి కరిపిస్తే అఫ్గాన్ టీమ్ సెమీస్ కి చేరుకుంటుంది…
ఇక ఇంగ్లాండ్ టీమ్ 5 మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది.దాంతో ఇంగ్లాండ్ టీమ్ ఇపుడున్న పరిస్థితిలో ఎంత ట్రై చేసిన కూడా వాళ్ళు సెమీస్ కి రావడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు పాయింట్స్ తో పాటు రన్ రేట్ కూడా పెంచుకోవాలి…
ఇక ప్రస్తుతం టీములు ఆడుతున్న ఆట తీరు ని బట్టి చూస్తే సెమీస్ కి వెళ్ళే నాలుగు టీములు ఏవి అంటే ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీములు అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది…