NZ Vs PAK: నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ద్వారా న్యూజిలాండ్ జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెడన్ పార్క్ లో జరిగిన రెండవ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక శనివారం మౌంట్ మౌం గనూయి వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడంతో అంపైర్లు ఈ మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. అనంతరం 265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 40 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పై సొంతం చేసుకుంది.
Also Read: అనుకున్నదే జరిగింది.. చెన్నై హ్యాట్రిక్.. ఢిల్లీ టాప్..
లైట్స్ ఆఫ్
శనివారం జరిగిన వన్డేలో ఒక వింత చోటుచేసుకుంది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభమైన సమయంలో.. న్యూజిలాండ్ బౌలర్ డఫి బౌలింగ్ వేసాడు. ఈ క్రమంలో స్టేడియంలోని దీపాలు ఒక్కసారిగా హాఫ్ అయ్యాయి. అయితే అప్పటికే బౌలర్ బంతిని వేయడంతో.. చీకటిగా ఉండటం వల్ల ఏది కనిపించకపోవడంతో బ్యాటర్ పక్కకు తప్పుకున్నాడు. ఈ సంఘటన మైదానంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో కామెంటేటర్లు, మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగిందని తెలిసింది..” ఉన్నట్టుండి ఒకసారిగా దీపాలు ఆగిపోయాయి. మైదానం మొత్తం చీకటి అలముకుంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికే మళ్లీ దీపాలు ఆన్ అయ్యాయి. మ్యాచ్ మళ్లీ యధావిధిగా మొదలైంది. అయితే లైట్స్ ఆన్ అయిన తర్వాత.. మ్యాచ్ మళ్లీ ప్రారంభించడానికి కాస్త సమయం పట్టింది. ఎంపైర్లు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందని తెలియడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ పరిణామంతో ఆటగాళ్లు కూడా ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. చివరికి దీపాలు ఆన్ కావడంతో మ్యాచు మళ్ళీ మొదలైంది. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 43 పరుగుల తేడాతో గెలిచింది. మొత్తంగా సిరీస్ కూడా వైట్ వాష్ చేసింది. 3-0 తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసిందని” న్యూజిలాండ్ మీడియా తన కథనాలలో పేర్కొంది.
Light cut off #NZvsPAK pic.twitter.com/tILdwSQr3H
— Random Cricket Fan (@CricMinded) April 5, 2025