https://oktelugu.com/

87 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌ టైమ్‌..: రంజీ ట్రోఫీ రద్దు

అనుకున్నదే జరిగింది. కరోనా మహమ్మారి దెబ్బ రంజీ ట్రోఫీని కూడా తాకింది. 87 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీకి ఫస్ట్‌‌ టైమ్‌‌ బ్రేక్‌‌ పడింది. ఇండియా క్రికెట్‌‌కుటాలెంటెడ్‌‌ ప్లేయర్లను అందిస్తున్న ఈ ఫస్ట్‌‌ క్లాస్‌‌ ఈవెంట్‌‌ ఈసారి జరగడం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్‌‌లో ఈ మల్టీ డే టోర్నీని హోస్ట్‌‌ చేయలేమని స్టేట్‌‌ అసోసియేషన్లు చెప్పడంతో రంజీలపై బీసీసీఐ రాజీ పడక తప్పలేదు. దాంతో.. ఈ రెడ్‌‌బాల్‌‌ మెగా టోర్నీ లేకుండానే ఇండియన్‌‌ […]

Written By: Srinivas, Updated On : January 31, 2021 11:04 am
Follow us on


అనుకున్నదే జరిగింది. కరోనా మహమ్మారి దెబ్బ రంజీ ట్రోఫీని కూడా తాకింది. 87 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీకి ఫస్ట్‌‌ టైమ్‌‌ బ్రేక్‌‌ పడింది. ఇండియా క్రికెట్‌‌కుటాలెంటెడ్‌‌ ప్లేయర్లను అందిస్తున్న ఈ ఫస్ట్‌‌ క్లాస్‌‌ ఈవెంట్‌‌ ఈసారి జరగడం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్‌‌లో ఈ మల్టీ డే టోర్నీని హోస్ట్‌‌ చేయలేమని స్టేట్‌‌ అసోసియేషన్లు చెప్పడంతో రంజీలపై బీసీసీఐ రాజీ పడక తప్పలేదు. దాంతో.. ఈ రెడ్‌‌బాల్‌‌ మెగా టోర్నీ లేకుండానే ఇండియన్‌‌ డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో ఓ సీజన్‌‌ ముగియనుంది. అయితే, విజయ్‌‌ హజారే వన్డే ట్రోఫీ, వినూ మన్కడ్‌‌ టోర్నీ (అండర్‌‌–19), విమెన్స్‌‌ వన్డే ట్రోఫీలను కండక్ట్‌‌ చేస్తామని చెప్పిన బీసీసీఐ క్రికెటర్లకు కాస్త రిలీఫ్‌‌ ఇచ్చింది.

ఇండియన్‌‌ డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లోనే అతిపెద్ద టోర్నీ అయిన రంజీ ట్రోఫీ లేకుండానే 2020–21 సీజన్‌‌ ముగియనుంది. 1934–35 సీజన్‌‌లో మొదలైన మెగా టోర్నీ నాటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది. కానీ.. 87 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ సీజన్‌‌ క్యాలెండర్‌‌లో రంజీలకు ప్లేస్‌‌ దక్కలేదు. కరోనా ప్రొటోకాల్స్‌‌ నేపథ్యంలో భారీ ఈవెంట్‌‌ అయిన రంజీ ట్రోఫీని ఈసారికి నిర్వహించలేమని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ జైషా నుంచి స్టేట్‌‌ అసోసియేషన్లకు శుక్రవారమే లెటర్లు కూడా అందాయి. అయితే, విజయ్‌‌ హజారే వన్డే ట్రోఫీ, వినూ మన్కడ్‌‌ (అండర్‌‌–19) తోపాటు మహిళల వన్డే టోర్నీలను నిర్వహిస్తామని జై షా పేర్కొన్నారు. ‘స్టేట్‌‌ అసోసియేషన్ల నుంచి వచ్చిన ఫీడ్‌‌బ్యాక్‌‌ ప్రకారం రంజీ ట్రోఫీ లేకుండానే ఈసారి డొమెస్టిక్‌‌ సీజన్‌‌ను పూర్తి చేస్తున్నాం. కరోనా ప్రొటోకాల్స్‌‌ను పాటిస్తూ మ్యాచ్‌‌లను సురక్షితంగా నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో క్రికెట్‌‌ క్యాలెండర్‌‌ను సిద్ధం చేయడం చాలా టఫ్‌‌గా అనిపించింది. మరోపక్క మహిళల క్రికెట్‌‌ తిరిగి జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. అందుకే విజయ్‌‌ హజారే( మెన్స్‌‌ 50 ఓవర్‌‌ టోర్నీ), వినూ మన్కడ్‌‌ ట్రోఫీ (అండర్–19)తోపాటు మహిళల వన్డే టోర్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈ టోర్నీలకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే అందజేస్తాం’ అని స్టేట్‌‌ అసోసియేషన్లకు పంపిన లేఖలో జైషా పేర్కొన్నారు. అంతేకాక సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20 టోర్నమెంట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తుండటంతో ఇండియా, ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌ను సక్సెస్‌‌ చేయగలమనే నమ్మకం పెరిగిందని జైషా పేర్కొన్నారు. ‘ముస్తాక్‌‌ అలీ ట్రోఫీ ఇప్పటిదాకా ఎలాంటి ఆటంకం లేకుండా సక్సెస్‌‌ఫుల్‌‌గా జరిగింది. ఫిబ్రవరి 5న మొదలయ్యే ఇండియా, ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌కు కూడా చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి’ అని జైషా తెలిపారు.

కరోనా దెబ్బకు విధించిన లాక్‌‌డౌన్‌‌ తర్వాత ఇండియాలో డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌ పూర్తిగా నిలిచిపోయింది. ఐపీఎల్‌‌ను యూఏఈలో నిర్వహించగా.. ముస్తాక్‌‌ అలీతో ఇండియాలో క్రికెట్‌‌ రీస్టార్ట్‌‌ అయ్యింది. అయితే, డొమెస్టిక్‌‌ క్యాలెండర్‌‌ తయారీకి సంబంధించి బోర్డు ఏజీఎమ్స్లో చర్చిస్తూ వచ్చారు. అంతేకాక డొమెస్టిక్‌‌ క్యాలెండర్‌‌పై తమ అభిప్రాయాలను పంపాలని స్టేట్‌‌ అసోసియేన్లకు బోర్డు ప్రశ్నోత్తరాలను కూడా పంపింది. బయో బబుల్‌‌లో రంజీ ట్రోఫీ నిర్వహణ తమ వల్ల కాదని చాలా అసోసియేషన్లు అప్పుడే స్పష్టం చేశాయి. బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ గంగూలీ, సెక్రటరీ జైషా ప్రారంభం నుంచి రంజీ ట్రోఫీ నిర్వహణకే మొగ్గు చూపారు. కానీ.. స్టేట్‌‌ మెంబర్స్‌‌ నుంచి సహకారం లేకపోవడంతో చివరికి ఈ ఏడాది క్యాలెండర్‌‌ నుంచి రంజీని తప్పించారు. కాగా, రంజీ ట్రోఫీ ఆడే ప్లేయర్లకు మ్యాచ్‌‌ ఫీజు కింద అత్యధికంగా రూ.1.5 లక్షల వరకు అందుతుంది. ఈ ఫీజు సంగతెలా ఉన్నా, రంజీ ట్రోఫీ కోసం ప్లేయర్లను 2 నెలల పాటు బయో బబుల్‌‌లో ఉంచడం ఫైనాన్షియల్‌‌గా మరింత భారమవుతుందనే అభిప్రాయం కూడా సర్వత్రా ఉంది. దీంతో ఈ సీజన్ రంజీ ట్రోఫీని రద్దు చేశారు.

రంజీ ట్రోఫీ క్యాన్సిల్‌‌ అయినప్పటికీ ఆ టోర్నీ మ్యాచ్‌‌ ఫీజులపై ఆధారపడి జీవించే క్రికెటర్లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని బీసీసీఐ ట్రెజరర్‌‌ అరుణ్‌‌ ధుమాల్‌‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఏజీఎమ్‌‌లో కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్టేట్‌‌ అసోసియేషన్లు, ఇతర స్టేక్‌‌ హోల్డర్ల అభిప్రాయం మేరకే రంజీ ట్రోఫీని ఈసారికి రద్దు చేశామని ధుమాల్‌‌ వెల్లడించారు. ‘ప్లేయర్లు, సెలెక్షన్‌‌ కమిటీలు, స్టేట్‌‌ అసోసియేషన్లు ఇలా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించాం. 2020 ఇప్పటికే అయిపోయింది. అందువల్ల ఒకే క్యాలెండర్‌‌ ఇయర్‌‌లో రెండు రంజీ ట్రోఫీలు ఎందుకని ఎక్కువ మంది అన్నారు. వైట్‌‌బాల్‌‌ క్రికెట్‌‌పై దృష్టిపెడితే బెటరని సూచించారు. వచ్చే ఏడాది విమెన్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌, అండర్‌‌ –19 వరల్డ్‌‌కప్‌‌ ఉన్నాయి. రంజీ లేకపోవడంతో ఈ సీజన్‌‌లో జూనియర్‌‌, మహిళల క్రికెట్‌‌కు కాస్త చాన్స్‌‌ దొరికింది. ఏదో ఒక్క టోర్నీతో సరిపెట్టుకునే దాని కంటే వేర్వేరు కేటగిరీల్లో ఎక్కువ పోటీలు ఉండటం మంచిదని భావించాం. అంతేకాక రంజీ ట్రోఫీ లేకపోవడం వల్ల నష్టపోయే ప్లేయర్లందరికీ ఫైనాన్షియల్‌‌ సపోర్ట్‌‌ ఇస్తామని హామీ ఇస్తున్నాం’ అని ధుమాల్‌‌ పేర్కొన్నారు.