Koratala Siva
Koratala Siva : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట రైటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల శివ (Koratala Shiva) ఆ తర్వాత దర్శకుడిగా మారి ప్రభాస్ తో మిర్చి (Mirchi) అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో శ్రీమంతుడు (Sri manthudu) సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలతో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న కొరటాల శివ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నప్పటికి ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా కోసం ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా దేవర (Devara) సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ అనుకున్నప్పటికి ఆ సినిమా కేవలం 500 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో అటు ఎన్టీఆర్ తో పాటు అతని అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురయ్యారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండటం తద్వారా సినిమా సక్సెస్ ని సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందంటూ ప్రచారమైతే చేశారు.
Also Read : కొరటాల శివ ని తప్పించుకొని తిరుగుతున్న ఎన్టీఆర్..సమయం వృధా చేసుకోకు అంటూ వార్నింగ్!
ఎట్టకేలకు కొరటాల శివ ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన పనుల్లో బిజీగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత తను చేసే సినిమా మీద పూర్తి ఫోకస్ ని కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోయే సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే వరుసగా ఏడు విజయాలను అందుకున్న ఆయన ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించి ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేయమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : దేవర తో ఢీలాపడ్డ కొరటాల శివ…ఆయనకి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం కష్టమేనా..?