https://oktelugu.com/

Nitish Kumar Reddy : కోహ్లీ షూ అంటే అట్లుంటది.. దెబ్బకు నితీష్ సెంచరీ..

Nitish Kumar Reddy : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన టెస్టులలో టీమిండియా నెగ్గలేకపోయింది. అయితే మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు.

Written By: , Updated On : March 21, 2025 / 11:35 AM IST
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

Follow us on

Nitish Kumar Reddy : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన టెస్టులలో టీమిండియా నెగ్గలేకపోయింది. అయితే మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. టీమిండియా అత్యంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. సెంచరీ చేసి మ్యాచ్ ను ఒక్కసారిగా మార్చేశాడు. అయితే అతడిలాగే మిగతా ఆటగాళ్లు కూడా ఆడి ఉంటే టీమిండియా కు మెల్ బోర్న్ టెస్టులో అనుకూలమైన ఫలితం వచ్చేది. కానీ మిగతా ఆటగాళ్లు సరిగా ఆడలేక పోవడంతో టీమ్ ఇండియాకు వ్యతిరేకమైన ఫలితం వచ్చింది.. అయితే ఆ సెంచరీ నితీష్ కుమార్ రెడ్డి క్రీడా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. దిగ్గజ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డిని అభినందించారు. రవి శాస్త్రి అయితే ఏకంగా కన్నీటిపర్యం అయ్యాడు. గత ఏడాది జరిగిన ఈ టెస్ట్ టీమిండి అభిమానులకు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది.

Also Read : అరే అజామూ.. ఐపీఎల్ లో నితీష్ హవా షురూ

పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో..

ఇక ప్రఖ్యాత స్పోర్ట్స్ దుస్తులు, ఉపకరణాల తయారీ సంస్థ ప్యూమా నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ చేయడానికి ప్రేరేపించిన పరిస్థితులను వెల్లడించాడు..” ఆ మ్యాచ్ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ తన దగ్గర ఉన్న బూట్లను ఇవ్వాలని సర్ఫరాజ్ ను సైజ్ అడిగారు. అతడు 9 అని చెప్పాడు. దీంతో విరాట్ కోహ్లీ నా వైపు తిరిగాడు. నా సైజు ఎంత అని అడిగాడు. దానికి పది అని చెప్పాను. నా పరిమాణం కాకపోయినప్పటికీ అతడు బూట్లు ఇవ్వాలని కోరుకున్నాను. అదృష్టవశాత్తు అవి నాకు ఇచ్చాడు. ఆ బూట్లు ధరించి నేను సెంచరీ చేశాను. అది నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. మెల్ బోర్న్ మైదానంలో స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించడానికి విరాట్ కోహ్లీ ఇచ్చిన బూట్లు కూడా ఒక కారణమయ్యాయి. అందువల్లే నా క్రీడా జీవితం ఇలాంటి మలుపులు తిరిగింది. మొత్తానికి ఇటువంటి సందర్భం నా జీవితంలో వచ్చినందుకు గర్వపడుతున్నానని” నితీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నాడు. మరోవైపు ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి గత ఏడాది జరిగిన ఐపీఎల్లో అదరగొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అతడు ఆడిన ఆట తీరు వల్లే జాతీయ జట్టులో అవకాశం లభించింది. టి20 లలో, టెస్టులలో తన స్థానాన్ని మరింతగా పదిలం చేసుకున్నాడు.

Also Read : గౌతమ్ గంభీర్ నిర్వాకం.. నితీష్ కుమార్ రెడ్డి కెరియర్ ప్రమాదంలో పడిందా?