https://oktelugu.com/

Color Are Like: ఈ రంగును ఇష్టపడే వారి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా..?

పుర్రె కో బుద్ధి.. జిహ్వకో రుచి.. అన్నారు పెద్దలు. సమాజంలో కోట్ల మంది ప్రజలు ఉన్న.. ఒకరి రి అభిప్రాయాలు.. మరొకరికి మ్యాచ్ కాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి అలవాట్లు, ఆలోచనలు మిగతా వారితో పోల్చుకోకుండా కొనసాగుతాయి.

Written By: , Updated On : March 21, 2025 / 11:41 AM IST
Favorite-colors,

Favorite-colors,

Follow us on

Color Are Like: పుర్రె కో బుద్ధి.. జిహ్వకో రుచి.. అన్నారు పెద్దలు. సమాజంలో కోట్ల మంది ప్రజలు ఉన్న.. ఒకరి రి అభిప్రాయాలు.. మరొకరికి మ్యాచ్ కాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి అలవాట్లు, ఆలోచనలు మిగతా వారితో పోల్చుకోకుండా కొనసాగుతాయి. అయితే ఇదే సమయంలో అందరికీ ఒక రంగు నచ్చుతుంది.. మరొకరికి మరో రంగు ఇష్టంగా మారుతుంది. అయితే రంగులను బట్టి వారి వ్యక్తిత్వాలను తెలుసుకోవచ్చని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో నీలం రంగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా శుభ సూచకానికి ఎక్కువగా నీలం రంగును వాడుతూ ఉంటాం. అంతేకాకుండా నీలం రంగు విజయానికి ప్రత్యేకగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే నీలం రంగును ఎక్కువగా ఇష్టపడే వారి ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలుసుకుందాం..

కొందరు తమ ఇంటికి ఎక్కువగా నీలం రంగు వేస్తూ ఉంటారు.. అలాగే ఇంట్లోని వస్తువులు కూడా నీలం రంగులో ఉండేలా చూసుకుంటారు. ఇలాంటి వారి వ్యక్తిత్వం విభిన్నంగా ఉంటుంది. నీలం రంగును ఎక్కువగా ఇష్టపడేవారు ప్రశాంతతను కోరుకుంటారు. మీరు ఉద్రిక్తత వాతావరణానికి దూరంగా ఉంటారు. చెడు విషయాలను ఎక్కువగా పట్టించుకోరు. భావోద్వేగాలను లోతుగా పరిశీలిస్తారు. వీరితో ఉండడంవల్ల మిగతా వారికి కూడా ప్రశాంతత కలుగుతుంది. అందుకే నీలం రంగును ఇష్టపడే వారితో ఎక్కువ మంది స్నేహం చేయడానికి ఆసక్తి చూపుతారు.

ఈ రంగును ఇష్టపడేవారు వివాదాలను పరిష్కారం చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే వారికి ఇష్టమైతేనే ఇటువైపు వస్తారు. ముఖ్యంగా ఇంట్లో గందరగోళం లేకుండా చూసుకుంటారు. అంతకంటే ముందుగా ఇంట్లోనే సోఫా సెట్ లేదా ఇతర దుస్తులు నీలం రంగులో ఉండేలా చూస్తారు. నీలం రంగు వల్ల కంటికి కూడా ఇంపుగా ఉంటుంది. కళ్లకు ప్రశాంతతను ఇస్తాయి. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ రంగును ఇష్టపడే వారు కూడా ప్రశాంతతతో ఉంటారు.

ఇక నీలం రంగు వారి ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళికలు వేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. జీవితంలో ప్రతి ఒక్కరికి వీరు నమ్మకంగా ఉండేలా చేస్తారు. సమాజంలో వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా విహారయాత్రలు చేసే వీరు ప్రకృతితో మమేకమై పోతారు. విశాలమైన ప్రపంచంలో జీవించాలని కోరుకుంటారు. ఒక వ్యక్తిపై ఎక్కువగా నమ్మకం ఉండాలని అనుకుంటే నీలం రంగు ఇష్టపడే వారిని నమ్మవచ్చు. తమ పనుల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే వారితో వాదించకుండా సమస్యను పరిష్కరించుకుంటారు.

ఇంట్లో ఎటువంటి సమస్యలున్న వెంటనే పరిష్కారానికి ప్రయత్నిస్తారు. కొత్త వ్యక్తులతో అంతగా స్నేహం చేయని మీరు ఒకవేళ వీరు నమ్మితే జీవితాంతం కలిసే ఉండేలా ప్రయత్నిస్తారు. అంతేకాకుండా వీరు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమతో చూస్తూ ఉంటారు. వీరిని వివాహం చేసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఒక్కసారి వీరికి దూరమైతే మళ్లీ కలవడం కష్టంగా మారుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు వీరితో స్నేహపూర్వకంగానే ఉండేందుకు ప్రయత్నం చేయాలి.