Scooty
Scooters: కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు బైక్ ను ఎక్కువగా కోరుకున్నవారు.. ఇప్పుడు స్కూటర్లపై మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా యూత్ ఇలాంటి స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేయడంతో వీటి సేల్స్ పెరిగిపోతున్నాయి. కొత్తరకం స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టంచింది. Honda కంపెనీ. ఈ కంపెనీకి చెందిన Activa ఎవర్ గ్రీన్ గా నిలిచింది. చాలా మంది ఈ వెహికల్ ను సొంతం చేసకున్నారు. ఈ స్కూటర్ కు ఇక తిరుగులేదు.. అనుకున్న సమయంలో TVS నుంచి రిలీజ్ అయిన కొత్త తరం Zupiter సంచలనాల అమ్మకాలను నమోదు చేసింది. 2025 ఫిబ్రవరి నెలలో ఈ స్కూటర్ లక్షకు పైగా యూనిట్లు సేల్స్ అయ్యాయి. అయితే ఇందులో ఉండే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
భారత్ లో ప్రసిద్ద స్కూటర్లను తీసుకొచ్చిన టీవీఎస్ గురించి తెలియని వారు ఉండరు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో ఆకట్టుకునే మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే నేటి వారిని ఆకట్టుకునేందుకు ఈ కంపెనీ కొత్తతరం స్కూటర్లను తీసుకొచ్చింది. అదే జుపిటర్. ఈ స్కూటర్ ను 2025 ఫిబ్రవరి నెలలో 1,003,576 యూనిట్లు సేల్స్ అయ్యాయి. 2024 ఏడాది ఫిబ్రవరిలో దీనిని 73,860 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ స్కూటర్ 40.23 శాతం వృద్ధి నమోదు చేసింది.
ఇప్పటి వరకు హోండా యాక్టివా జగజ్జేతగా నిలిచింది. అయితే ఈస్కూటర్ గత ఏడాది ఫిబ్రవరిలో 2,00,134 యూనిట్లు అమ్ముడు పోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,74,009 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది ఈ స్కూటర్ల 13.05 శాతం తగ్గిపోయాయి. దీనిని బట్టి చూస్తే హోండా కంటే జూపిటర్ ను ఎక్కువగా ఆదరిస్తున్నారని తెలుస్తోంది. అయితే Zupiterలో ఉండే ప్రత్యేక ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఆవేంటంటే?
కొత్త జుపీటర్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మోడల్ రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. జుపీటర్ 110 సీసీ లో 113 సీసీ ఇంజిన్ పనిచేస్తుంది. దీనిని మార్కెట్లో రూ.78,391 ఎక్స్ షో రూం ధరతో విక్రయిస్తుననారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.92,366తో ఉంది. ఇది లీటర్ ఇంధనానికి 53.84 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మరో మోడల్ 125 విషయానికొస్తే ఇది 124.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. దీనిని రూ.88,174 తో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ 99,015 గా ఉంది. ఈ మోడల్ లీటర్ ఇంధనానికి 55 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ రెండు మోడళ్లకు దీనికి యూఎస్ బీ ఛార్జింగ్ తో పాటు ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
జుపీటర్ పెట్రోల్ మాత్రమే కాకుండా CNG వెర్షన్ లో కూడా రాబోతుంది. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ ను కలిగి రూ.లక్ష రూపాయల ధరను కలిగి ఉంది. అయితే ఇది వచ్చే అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ మోడల్ 226 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.