New Zealand Vs Pakistan
New Zealand Vs Pakistan: న్యూజిలాండ్(Newziland)వర్సెస్ పాకిస్థాన్(Pakisthan) మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కివీస్ జట్టు 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ క్రై స్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి బదులుగా న్యూజిలాండ్ 10.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 92 పరుగులు సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యం పొందింది. న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ మరియు ఫిన్ అలెన్ జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఫెర్ట్ 29 బంతుల్లో 44 పరుగులు చేసి, అబ్రార్ అహ్మద్(Abrar Ahmed)బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఫిన్ అలెన్‌తో టిమ్ రాబిన్సన్ జత కలిశాడు. వీరిద్దరూ జట్టును విజయతీరంలో నిలిపారు. విజయానికి కావాల్సిన చివరి పరుగులను రాబిన్సన్ సాధించాడు. మ్యాచ్‌లో ఒక వింత సంఘటన కూడా చోటుచేసుకుంది. న్యూజిలాండ్ విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నప్పుడు అంపైర్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
Also Read: టోర్నీ ఏదైనా.. విజయం టీమిండియాదే.. తాజాగా మాస్టర్స్ ఛాంపియన్స్ మనమే..
పదో ఓవర్ చివరి బాల్..
10వ ఓవర్ చివరి బంతికి ఫిన్ అలెన్ ఒక ఫోర్ కొట్టాడు. ఈ షాట్‌తో న్యూజిలాండ్‌కు విజయానికి రెండు పరుగులు మాత్రమే అవసరం. అయితే, అంపైర్ డ్రింక్స్ బ్రేక్(Drinks Break) కోసం సిగ్నల్ ఇచ్చాడు. ఈ నిర్ణయం ఆటగాళ్లను, ముఖ్యంగా ఫిన్ అలెన్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. జట్టు గెలిచే సమయంలో ఇలాంటి విరామం అవసరమా అని అందరూ ఆలోచనలో పడ్డారు. ఈ విరామం వల్ల విజయం కొన్ని నిమిషాలు ఆలస్యమైంది.
డ్రింక్స్ బ్రేక్ తర్వాత, రాబిన్సన్ అబ్రార్ అహ్మద్ బంతికి రెండు పరుగులు తీసి, న్యూజిలాండ్‌కు 9 వికెట్ల విజయాన్ని అందించాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 29 పరుగులతో, టిమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. కైల్ జామీసన్ 3/8, జాకబ్ డఫీ 4/14తో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది.
Also Read: నేను గదిలో విచారంగా, ఒంటరిగా చేతులు కట్టుకుని కూర్చోవాలా.. విరాట్ సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేశాడు ?