New Zealand Vs Pakistan
New Zealand Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంతవరకూ ఏ టీం మేనేజ్మెంట్ కూడా తమ ఆటగాళ్లకు మిలటరీ తో శిక్షణ ఇప్పించలేదు. కానీ, తొలిసారిగా పాకిస్తాన్ జట్టు ఆ పని చేసింది. ఆటగాళ్లను సైనికుల మాదిరి ట్రీట్ చేసింది. రన్నింగ్, జంపింగ్, రాక్ క్లైమ్బింగ్.. ఇలా అన్నింటిలో శిక్షణ ఇచ్చింది. కానీ, ఏం ఉపయోగం? ఆటగాళ్లు గల్లి స్థాయిలో ఆడుతుంటే.. ఆ దేశం పరువు సింధు నదిలో కలిసిపోయింది.
వాస్తవానికి పాకిస్తాన్ జట్టు గత ఏడాది మన దేశం వేదికగా వరల్డ్ కప్ లో అత్యంత నాసిరికమైన ఆట తీరు ప్రదర్శించింది. దీంతో ఆ దేశపు క్రికెట్ బోర్డు ఆ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఓటమికి కారణం ఇతడే అంటూ బాబర్ అజామ్ పై వేటు వేసింది. వన్డే, టి20, టెస్ట్ ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లను నియమించింది. అయినప్పటికీ ఆ జట్టు కథ మారలేదు. పైగా దరిద్రం మరింత తీవ్రంగా తాండవం చేసింది. వరుస ఓటములతో పాకిస్తాన్ పరువు పోగొట్టుకుంది.. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ లో సత్తా చాటాలని భావించిన ఆ జట్టు మేనేజ్మెంట్.. కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లను మళ్లీ జట్టులోకి తీసుకుంది.. నాసిరకమైన ఫీల్డింగ్ కు స్వస్తి పలికాలని నిర్ణయించుకుంది. ఆర్మీతో శిక్షణ ఇచ్చింది. అలా తర్ఫీదు పొందిన జట్టు ఎలా ఆడాలి? కానీ ఎలా ఆడుతుంది అంటే.. న్యూజిలాండ్ తో సొంత దేశంలో జరుగుతున్న టి20 సిరీస్ లో పాకిస్తాన్ వెనుకబడిపోయింది. సిరీస్ క్లీన్ స్వీప్ చేసే స్థాయి నుంచి సమం అయితే చాలు అనే స్థాయికి దిగజారింది.
కీలక ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్న నేపథ్యంలో.. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. తొలి టి20 వర్షం వల్ల రద్దయింది. రెండవ టి20 లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ దేశం సిరీస్ దక్కించుకుంటుందని అందరూ భావించారు. కానీ న్యూజిలాండ్ జట్టు బౌన్స్ బ్యాక్ అయింది.. మూడో టి20 లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగో టి20 లో నాలుగు పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది. ఫలితంగా సిరీస్ మీద న్యూజిలాండ్ జట్టు కన్నేసింది. 5 t20 ల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ శనివారం జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో.. పాకిస్తాన్ ఆటగాళ్ల తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ అభిమానులు ఆ జట్టు ఆటగాళ్ళను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.
New Zealand – Playing without their first 16 choice players.
Pakistan – playing a full strength team.
– NZ leads by 2-1 against Pakistan in Pakistan. pic.twitter.com/Hs4Jm1f3Wn
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024