IPL Mega Auction -2025 : ఐపీఎల్ మెగా వేలం -2025 కి సంబంధించి ఒక ఆర్టీఎం కార్డును ఉపయోగించి గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఒక జట్టు తన వద్ద ఉంచుకునేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం.. శనివారం ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ సమావేశంలో పై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఐదుగురు ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్టీఎం కార్డును ఉపయోగించుకోవడానికి స్వేచ్ఛాయుత అవకాశాన్ని ఇవ్వనున్నారు. ముందుగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి నిబంధనలు రూపొందించారు. అయితే కొన్ని జట్లు తన బ్రాండ్ వాల్యూ పోతుందని గగ్గోలు పెట్టడంతో బీసీసీఐ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఐదుగురు ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకునే అవకాశాన్ని తెరపైకి తెచ్చినట్టు సమాచారం.. ఐదుగురు ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవడం, ఆర్టీఎం కార్డును ఉపయోగించడం వంటి నిబంధనలు.. కొత్తగా జట్టు నిర్మించుకుని.. మరింత పటిష్టం చేసుకునే వారిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వంటి ఫ్రాంచైజీలపై ప్రభావం చూపుతాయని వాదనలు లేకపోలేదు. అయితే ఈ యాజమాన్యాలు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొనే నిబంధనకు జై కొట్టడం విశేషం.
రి టెన్షన్ ప్రక్రియలో ఇలా..
రి టెన్షన్ ప్రక్రియలో ఆయా జట్లు తమకు ఇష్టమైన ఆటగాళ్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లు, అనామక ఆటగాళ్లని కూడా భాగం చేసుకోవాల్సి ఉంటుంది.. మరికొన్ని గంటల్లో ఐపిఎల్ 2025 రి టెన్షన్ విధానానికి సంబంధించి బిసిసిఐ మరింత క్వాలిటీ ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భారత్ వెలుపల మెగా వేలం జరిగే సూచనలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సౌదీ అరేబియా వేదికగా మెగా వేలం జరుగుతుంది. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మెగా వేలం నిర్వహించడానికి ఐపీఎల్ నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. మెగా వేలానికి సంబంధించి నిబంధనల విషయంలో ఇప్పటికే ఫ్రాంచైజీలతో బీసీసీఐ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో షారుక్ ఖాన్ – లక్నో జట్టు యజమాని మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆటగాళ్ల రి టెన్షన్ విషయంలో వారిద్దరూ పరస్పరం వాదనకు దిగినట్టు సమాచారం. అయితే వారిద్దరికీ కావ్య మారన్, ఇంకా కొన్ని జట్ల యజమానులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత కొన్ని విషయాలపై జట్ల యాజమాన్యాలు ఏకభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. మరికొన్ని విషయాలపై నిరాసక్తతను ప్రదర్శించాయి.