https://oktelugu.com/

Hassan Nasrallah : ఎవరీ నస్రల్లా.. బలమైన ఇజ్రాయిల్ కు ఇన్ని రోజులు ముచ్చెమటలు ఎలా పట్టించాడు?

డిఫెన్స్ టెక్నాలజీలో ఇజ్రాయిల్ అత్యంత బలమైనది. సాంకేతిక రంగాన్ని వాడుకోవడంలో ఆ దేశం తర్వాతే మిగతా దేశాలు. అలాంటి దేశం కూడా ఓ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ ఎత్తుల ముందు చిత్తయిపోయింది. అతని దాడుల ముందు వెలవెల పోయింది. చివరికి అతడిని చంపినప్పటికీ.. అతడు ఇజ్రాయిల్ దేశానికి చుక్కలు చూపించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 29, 2024 / 09:22 AM IST

    Hassan Nasrallah

    Follow us on

    Hassan Nasrallah :  పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ – గాజా మధ్య ఇటీవల యుద్ధం మొదలైంది. అది ఇప్పుడు లెబ నాన్ వరకు విస్తరించింది.. పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న హెజ్ బొల్లాను అంతమొందించాలని గట్టి ప్రణాళికలు రూపొందించింది. అందుకు తగ్గట్టుగానే దాడులు చేస్తోంది. క్రమంలో హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా ను చంపేసింది. బీ రూట్ లో ఓ భవనం సెల్లార్ కింద ఉన్న అతడిని అత్యంత శక్తివంతమైన బాంబు ప్రయోగించి ఇజ్రాయిల్ చంపేసింది. అతడిని చంపిన తర్వాత “ఉగ్రవాదం శాశ్వత విశ్రాంతి తీసుకుంటుందని” ఇజ్రాయిల్ వ్యాఖ్యానించింది.

    చుక్కలు చూపించాడు

    నస్రల్లా ఇజ్రాయిల్ దేశానికి చుక్కలు చూపించాడు. బీ రూట్ నగరంలో బుర్జ్ హమ్మూద్ అనే ప్రాంతంలో 1960లో నస్రల్లా పుట్టాడు. అతడి తండ్రి కూరగాయలను అమ్ముకుంటూ కుటుంబాన్ని సాకేవాడు. ఇతడికి 9 మంది తోబుట్టువులు. ఇతడిది షియా కుటుంబం. చిన్నప్పుడే నస్రల్లా మత విద్యను అభ్యసించాడు. 16 సంవత్సరాల వయసులో షియా పొలిటికల్ , పారా మిలిటరీ గ్రూప్ గా ఉన్న అమల్ ఉద్యమంలో ప్రవేశించాడు. ఆ సమయంలో అతడు అబ్బాస్ అల్ ముసావి ని ఆకర్షించాడు.

    పాలస్తీనా లిబ్రేషన్ ఆర్గనైజేషన్ నిర్మూలించడమే లక్ష్యంగా 1980లో లెబనాన్ పై ఇజ్రాయిల్ భీకరమైన దాడి చేసింది. ఆయుధంలో అది విజయం సాధించింది. ఆ సమయంలో బీ రూట్ ప్రాంతం నుంచి పి ఎల్ వో ను బయటికి పంపించింది. ఆపిఎల్ వోలో కొంతమంది 1982లో ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం పై దాడి చేసి.. 91 మంది అధికారులను చంపేశారు. ఆ తర్వాత ఈ ఘటనకు తామే కారణమని షియా ఇస్లామిస్టులు వెల్లడించారు. ఆ తర్వాత వాళ్లు హెజ్ బొల్లా గ్రూపుగా ఏర్పడ్డారు. దానికి మొదటి నుంచి మద్దతు ఇవ్వడం మొదలు పెట్టింది.. ఆ సంస్థ ఏర్పాటు ముసావి కీలక పాత్ర పోషిస్తే.. దానిని మరో స్థాయికి తీసుకెళ్లాడు నస్రల్లా. 1992లో ముసావి ఇజ్రాయిల్ దళాల చేతిలో హతమయ్యాడు. ఇక అప్పటినుంచి నస్రల్లా హిజ్ బొల్లా ను ముందుండి నడిపిస్తున్నాడు. నస్రల్లా నాయకత్వంలో హిజ్ బొల్లా సంస్థ బలపడింది. ఇజ్రాయిల్ దేశానికి పంటి కింద రాయిలాగా మారింది. పలుమార్లు ఇజ్రాయిల్ పై కీలకమైన దాడులు చేసింది.

    నస్రల్లా ఆధ్వర్యంలో అంతకంతకు విస్తరించిన హిజ్ బొల్లా ఏకంగా 2011లో సిరియా యుద్ధంలో పాల్గొంది. ఇజ్రాయిల్ భీకరమైన స్థాయిలో హిజ్ బొల్లా దాడులు చేసింది. ఫలితంగా అరబ్ సమాజంలో నస్రల్లా పేరు మారుమోగిపోయింది. దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని 18 సంవత్సరాలపాటు ఆక్రమించుకున్న ఇజ్రాయిల్ దళాలు 2000 సంవత్సరంలో జరిగిన యుద్ధం అనంతరం తిరిగి వెళ్ళిపోయాయి. నాడు జరిగిన పోరాటంలో నస్రల్లా ఆధ్వర్యంలోని హిజ్ బొల్లా ముఖ్యపాత్ర పోషించింది. ఈ యుద్ధం తర్వాత లెబనాన్ ప్రాంతంలో నస్రల్లా పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది . 2006లో లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయిల్ తో 34 రోజుల పాటు యుద్ధం జరిగితే.. అన్ని రోజులు ఇజ్రాయిల్ పై పై చేయి సాధించడం నస్రల్లా కీలక భూమిక పోషించాడు. అప్పటినుంచి ఇజ్రాయిల్ అతడిని బద్ధ శత్రువుగా ప్రకటించింది. అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత చివరికి గత శుక్రవారం చంపేసింది.