IPL Auction Rules : గతంలో ఉన్న రైట్ మ్యాచ్ కార్డ్ నిబంధనను బీసీసీఐ తిరిగి తీసుకొచ్చింది. అలాగే క్రికెట్ కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఆటగాడిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించే అవకాశం ఉంది. గరిష్టంగా ఆరుగురు ఆటగాలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. రిటైన్ ద్వారా ఆరుగురు ఆటగాళ్లకు అవకాశం దక్కంది. వేలం లేదా రిటైన్ విధానాలలో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లు ఐపిఎల్ 2027 వరకు ఆయా జట్ల యాజమాన్యాల లో కొనసాగాల్సి ఉంటుంది. ఇక ఈసారి కొత్తగా ఫ్రాంచైజీ పర్స్ విలువను 120 కోట్లకు బిసిసిఐ పెంచింది. ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ భేటి శనివారం బెంగళూరు వేదికగా జరగగా.. మెగా వేలానికి సంబంధించిన నిబంధనలను సిద్ధం చేశారు.. అయితే ఈసారి రిటైన్ చేసుకునే ఆటగాళ్ల విషయంలో ఒకరు కచ్చితంగా అన్ క్యాప్డ్ ప్లేయర్ ఉండాలనే నిబంధన విధించారు. ఈసారి గరిష్టంగా ఇద్దరు అన్ క్యాప్ట్ ఆటగాళ్లకు అవకాశం ఉంది. ఆ మిగిలిన వారిలో భారతీయులు లేదా విదేశీ ఆటగాళ్లయినా ఉండొచ్చు.
ఎలాంటి పరిమితి లేదు
రిటైన్ జాబితాలో విదేశీ ప్లేయర్లకు ఈసారి ఎలాంటి లిమిట్ లేదు. అంతేకాకుండా ఆరుగురు ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ అందరినీ ఆర్టిఎం కార్డు ద్వారా సొంతం చేసుకోవచ్చు. లేదా రిటైన్, ఆర్టీఎం కార్డు ద్వారా జట్టుతోనే ఉంచుకోవచ్చు. ఇక రి టెన్షన్ స్లాబ్ విషయంలోనూ సరికొత్త నిబంధనలను బీసీసీఐ తీసుకొచ్చింది. ఐదుగురు ఆటగాళ్లను ఒకవేళ రిటైన్ చేసుకుంటే 75 కోట్లు వెచ్చించాలి.. అన్ క్యాప్డ్ ఆటగాడికి నాలుగు కోట్ల ధరను చెల్లించాల్సి ఉంటుంది. తొలి మూడు రి టెన్షన్ లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇక మిగిలిన రెండు రి టెన్షన్ లకు రూ..18 కోట్లు, రూ. 14 14 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారం పర్స్ విలువ 120 కోట్లు ఉంటే.. రి టెన్షన్ కు 75 కోట్ల దాకా వెళుతుంది. కేవలం 45 కోట్లతోనే వేలానికి జట్లు వెళ్లాల్సి ఉంటుంది.. అలాంటప్పుడు అన్ క్యాప్డ్ ఆటగాడిని రిటైన్ చేసుకోవాలనుకుంటే 41 కోట్లతోనే వేలంలోకి వెళ్లాల్సి ఉంటుంది.
అన్ క్యాప్డ్ ప్లేయర్ గానే..
క్రికెట్ కు వీడ్కోలు పరికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్లేయర్ ను అన్ క్యాప్డ్ ఆటగాడిగా పరిగణించాలనే నిబంధనను ఈసారి తిరిగి తీసుకొచ్చారు.. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోనిని నాలుగు కోట్లకే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2022 మెగా వేలానికి ముందు ధోని చెన్నై జట్టు 12 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన 2027 వరకు కొనసాగుతుంది. వాస్తవానికి ఈ నిబంధన పై రోహిత్ లాంటి ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ సిసిఐ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కొనసాగాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే గతంలో నిర్వహించిన సమావేశాలలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు యాజమాన్యాలు సంపూర్ణంగా ఆమోదం తెలపకపోయినప్పటికీ.. దానిని కొనసాగించేందుకే బీసీసీఐ ముందడుగు వేయడం విశేషం.