Gautam Gambhir: భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఏ ముహూర్తంలో గౌతమ్ గంభీర్ ప్రధాన శిక్షకుడి బాధ్యతలు స్వీకరించాడు తెలియదు గాని.. అప్పట్నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు.. గతంలో టీమిండియా కు పనిచేస్తున్న కోచ్ లలో ఎవరూ ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కోలేదు.
గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమిండియా రెండు వన్డే సిరీస్ లు కోల్పోయింది. ఏకంగా మూడు టెస్ట్ సిరీస్ లలో ఓటమిపాలైంది. ఇంతవరకు ఒక్క టి20 సిరీస్ కోల్పోకపోయినప్పటికీ.. టెస్ట్ ఫార్మేట్ లో మాత్రం టీం ఇండియా ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. విదేశాలలో దారుణంగా ఉంటే.. స్వదేశంలో అత్యంత నాసిరకంగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.. దక్షిణాఫ్రికా చేతిలో రెండు టెస్టుల సిరీస్ కోల్పోయింది.. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను సమం చేసుకుంది.
గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమిండియా ఏమంత గొప్పగా ఆడటం లేదని మాజీ ప్లేయర్లు ఆరోపిస్తున్నారు.. గౌతమ్ గంభీర్ జట్టు కూర్పు విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు.. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్లో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. నిలకడ లేని ప్లేయర్లను ఎంపిక చేసి గౌతమ్ గంభీర్ తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకుంటున్నాడని సీనియర్ ప్లేయర్లు ఆరోపిస్తున్నారు.
సీనియర్ ప్లేయర్ల ఆరోపణలు ఈ విధంగా ఉంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మరో విధంగా ఉంది. నెటిజన్లు గౌతమ్ గంభీర్ మీద రకరకాల వీడియోలు రూపొందించి ట్రోల్ చేస్తున్నారు. గతంలో టీమిండియా ఓ మ్యాచ్లో విజయం సాధించింది. జట్టు ప్లేయర్లను అభినందించడానికి మైదానంలోకి గౌతమ్ గంభీర్ వెళ్ళాడు. అతని వెంట భార్య, కుమార్తె కూడా వెళ్లారు. ఈ సమయంలో వారి మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణకు నెటిజన్లు తమదైన సొంత వాక్యానాన్ని జత చేశారు. రాయలసీమ మాడలికంలో మాట్లాడారు. గౌతమ్ గంభీర్ ఆ సమయంలో తన సతీమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టుగానే నెటిజన్లు మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ఏది ఏమైనప్పటికీ లిప్ మూమెంట్ కు తగ్గట్టుగా మాట్లాడడం చూసేవాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Perfect Sync pic.twitter.com/zT6n91KWjK
— Navyanth (@Navyanth_17) December 8, 2025