Ustaad Bhagat Singh First Song Promo: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు తమ అభిమాన హీరో నుండి డ్యాన్స్ చూసి దాదాపుగా పుష్కరం దాటింది. ‘గబ్బర్ సింగ్ ‘ చిత్రం లో అభిమానులు కలలో కూడా ఊహించని స్టెప్పులను వేయించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ తర్వాత విడుదలైన సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసాడు కానీ, గబ్బర్ సింగ్ ఎనర్జీ, వైబ్ వేరే. మళ్లీ అలాంటి ఎనర్జీ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat singh) ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు హరీష్. నేడు ఈ చిత్రం లోని మొదటి సాంగ్ కి సంబంధించిన చిన్న ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. ‘స్టెప్పేస్తే భూకంపం’ అంటూ సాగే ఈ పాటలో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు. ఇదేంటి, ఇది నిజంగా మా పవన్ కళ్యాణ్ యేనా అని ఆశ్చర్యపోయే రేంజ్ లో డ్యాన్స్ మూవ్మెంట్స్ ఈ పాటలో ఉండబోతున్నాయని ఈ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పాడు డైరెక్టర్.
పూర్తి పాటలో ఇంకా మంచి స్టెప్పులు ఉంటే కచ్చితంగా ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. ఈ ప్రోమో చూసిన తర్వాత ఫ్యాన్స్ చెప్తున్నది ఒక్కటే, ఓజీ కేవలం టీజర్ మాత్రమే, అసలు సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఫ్యాన్స్ ని అలరిస్తుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చ్ వరకు ఆగాల్సిందే. స్టెప్పులు బాగానే ఉన్నాయి కానీ , దేవి శ్రీ ప్[రాసాడు అందించిన ట్యూన్ ని చూస్తుంటే, ఎక్కడో ఈ పాట విన్నట్టు గా అనిపిస్తుంది అని అంటున్నారు నెటిజెన్స్. దేవి శ్రీ ప్రసాద్ పాటలన్నీ ఇలాగే ఉంటాయి, కానీ అవే బంపర్ హిట్ అవుతుంటాయి. గతం లో ఇలాంటి ఉదాహరణలు మనం ఎన్నో చూసాము.
ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. ఈమధ్య కాలం లో ప్రతీ పవన్ కళ్యాణ్ సినిమాకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తూ వచ్చాడు. ఆయన కొరియోగ్రఫీ అభిమానులకు నచ్చేది కాదు. గతం లో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా మారింది. కానీ హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం లోని ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ పాటకు కొరియోగ్రఫీ చేయించాడు. అప్పట్లో ఈ పాట పెద్ద సెన్సేషన్. ఈ సినిమాకు కూడా చేయించాడో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా జనవరి 1న ప్రకటిస్తారని అంటున్నారు. ‘పెద్ది’ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని మార్చ్ 26 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
PowerStar @PawanKalyan‘s biggest dance buster that will rule every playlist and every dance floor #DekhlengeSaala Song Promo from #UstaadBhagatSingh out now
▶️ https://t.co/YykzNUbllpFull song out on December 13th ❤
Cult Captain @harish2you ‘s Mass Feast
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) December 9, 2025