Team India New Jersey: భారత క్రికెట్ స్పాన్సర్ గా మొన్నటిదాకా డ్రీమ్ 11 ఉండేది. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల వల్ల డ్రీమ్ 11 స్పాన్సర్ స్థానం నుంచి తప్పుకుంది. ఆ స్థానంలో ఇప్పుడు అపోలో టైర్స్ వ్యవహరిస్తోంది. ఇటీవల సిరీస్ లలో టీమిండియా ప్లేయర్లకు అపోలో టైర్స్ కొత్త జెర్సీలను అందించింది. కొత్త జెర్సీలను వినూత్నంగా రూపొందించింది అపోలో టైర్స్.
అపోలో టైర్స్ రూపొందించిన కొత్త జెర్సీలను ధరించిన టీమిండియా ప్లేయర్లు మురిసిపోతున్నారు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే టి20 సిరీస్ కు టీమిండియా ప్లేయర్లు అపోలో టైర్స్ రూపొందించిన జెర్సీలలో దర్శనమివ్వనున్నారు. ఈ జెర్సీలకు సంబంధించి టీమిండియా ప్లేయర్లు తమ మనోగతాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బిసిసిఐ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.సూర్య కుమార్ యాదవ్ నుంచి మొదలు పెడితే తిలక్ వర్మ వరకు తమ మనో గతాన్ని పంచుకున్నారు.
సూర్య కుమార్ యాదవ్ కొత్త జెర్సీని చూపిస్తూ.. ఆనందంగా మురిసిపోయాడు. భుజాల మీద ఉన్న తెలుపు రంగు థ్రెడ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఛాతి మీద ఉన్న బీసీసీఐ లోగో లో ఉన్న నక్షత్రాలు భారత క్రికెట్ జట్టు ధైర్యానికి సూచికలని పేర్కొన్నాడు. జెర్సీని చూస్తే ధైర్యం వస్తుందని.. ఆత్మ విశ్వసానికి ప్రతీకగా కనిపిస్తోందని సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జెర్సీ ని చూపిస్తూ.. తన మనోగతాన్ని వెల్లడించాడు. జెర్సీ బాగుందని పేర్కొన్నారు.. మెన్ ఇన్ బ్లూ కు జెర్సీ బలమైన నిదర్శనంగా కనిపిస్తోందని వివరించాడు.. జెర్సీ ధరించడం ద్వారా సరికొత్త ఆత్మవిశ్వాసం తమలో ఇనుమడిస్తోందని తిలక్ వర్మ అభిప్రాయపడ్డాడు. మిగతా ప్లేయర్లు కూడా తమ తమ మనోగతాలను వెల్లడించారు. కొత్త జెర్సీ ధరించి ఫోటోలు దిగారు..
టీమిండియా 2024 t20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. దక్షిణాఫ్రికా నుంచి మొదలుపెడితే ఆస్ట్రేలియా వరకు ప్రతి జట్టును ఓడించింది. స్వదేశం నుంచి మొదలు పెడితే విదేశం వరకు ఏ మైదానమైనా సరే టీమ్ ఇండియా ప్లేయర్లు వెనుకడుగు వేయలేదు. సూర్యకుమార్ నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఆరు టి20 సిరీస్ లు దక్కించుకుంది. పొట్టి ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
New threads
Same dreamEyes on the T20I series opener ⭐️ #TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/0Ydytkx2bH
— BCCI (@BCCI) December 9, 2025