Nitish Kumar Reddy : మెల్ బోర్న్ మైదానంలో సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డిపై అభిమానులు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యన్స్ ర్స్ తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఇందుకు ముఫాస ను సినిమాను వాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన ముఫాస సినిమాలో.. ఓ బుల్లి సింహం (ముఫాస పాత్రధారి) ఎంతటి సాహసానికైనా తెగిస్తుంది. ఎటువంటి శత్రువు ఎదురైనా ముందుకు దూసుకెళ్తోంది. అందువల్లే టాకాలు కాదని ముఫాస అడవికి రాజు అవుతుంది.. ఆ కథ జనానికి బాగా కనెక్ట్ అయింది. అందులో డ్రామా కూడా నచ్చింది. అందువల్లే ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఇప్పుడు టీమిండియాలో నితీష్ కుమార్ రెడ్డి కూడా ముఫాస లాంటివాడని నెటిజెన్లు కొనియాడుతున్నారు..”విరాట్ కోహ్లీ భయపడ్డాడు. రోహిత్ శర్మ చేతులెత్తేశాడు. రాహుల్ వెనుతిరిగాడు. పంత్ వెన్ను చూపించాడు. రవీంద్ర జడేజా ప్రతిఘటించలేకపోయాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి ఏమాత్రం భయపడలేదు. మిగతా ఆటగాళ్లలాగా వెన్ను చూపించలేదు. ధైర్యంగా ఆడాడు. పోరాటాన్ని ప్రదర్శించాడు. బీభత్సాన్ని ఆస్ట్రేలియా ప్లేయర్లకు కళ్ళ ముందు కనిపించేలా చేశాడు. మొత్తంగా మెల్బోర్న్ మైదానంలో తన పేరు ప్రవచించేలా చేశాడు. అందువల్లే అతడు ముఫాస పాత్రకు అచ్చు గుద్దినట్టు సరిపోయాడని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఆ సినిమా మాదిరిగానే..
ముఫాస సినిమాలోని ఓ సన్నివేశంలో.. బుల్లి సింహం (ముఫాస పాత్రధారి) ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. ఎన్ని ప్రన్ని బంధకాలైనా ఎదిరిస్తుంది. తోటి సింహాలు వారిస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోదు.. అయితే నెటిజన్లు రూపొందించిన వీడియోలో ముఫాస కు నితీష్ కుమార్ రెడ్డి అని పేరు పెట్టారు.. మిగతా సింహాలకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, రాహుల్ అని పేర్లు పెట్టారు. వారంతా వారిస్తున్నప్పటికీ ఆస్ట్రేలియాను ఎదిరించడానికి ముఫాస రూపంలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి వెళ్తున్నట్టు ఆ వీడియోలో చూపించారు. ఆస్ట్రేలియాను ఎదిరించి భారత జట్టును కాపాడాడు అని అర్థం వచ్చేలా ఆ వీడియోను రక్తి కట్టించారు. నితీష్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్ మైదానంలో సూపర్ సెంచరీ చేసిన నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..”ముఫాస గా మారిన నితీష్ కుమార్ రెడ్డిని చూశారా.. అతని తెగువ ఇంతకుమించి ఉంటుంది. ప్రస్తుతం ముఫాస సినిమా అదరగొడుతోంది. అందులో సింహం పాత్ర ఆకట్టుకుంటున్నది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ కూడా క్రికెట్ అభిమానులను ఆనందింపజేస్తోంది. చాలా కాలం తర్వాత అసలు సిసలైన టెస్ట్ బ్యాటింగ్ చూసాం. నితీష్ కుమార్ రెడ్డి ఇలానే తన కెరియర్ కొనసాగించాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.