Nani Paradise Movie Story Update: న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన కామెడీ ఎంటర్ టైనర్స్ ను నమ్ముకొని సినిమాలను చేశాడు. అప్పట్లో ఆయన చేసిన అష్టాచమ్మా, అలా మొదలైంది, ఈగ, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు భారీ విజయాలను సాధించడంతో నానికి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. ఇక ఆ తర్వాత ఆయన డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ వచ్చాడు. ఆయన ఎప్పుడైతే దసర సినిమాకి కమిట్ అయ్యాడో అప్పటినుంచి ఆయన మాస్ సినిమాల వైపే ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు. దసర సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు.
Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!
ఈ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని అటు శ్రీకాంత్ ఓదెల, ఇటు నాని ఇద్దరు ప్రయత్నం చేస్తుండడం విశేషం…ఇక వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో వీళ్ళ పేర్లు మారు మ్రోగిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకొని వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు స్టార్ హీరోలతో పాటు పోటీ పడలేని నాని ఇప్పుడు ఈ సినిమాతో పోటీకి వస్తున్నాడు. ఇక నాని కెరియర్ లో ఆయన చేసిన సినిమాల్లో మదర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు.
‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో అతనికి వాళ్ళ మదర్ కి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది. కానీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ప్యారడైజ్ సినిమా సైతం మదర్ సెంటిమెంటుతోనే తెరకెక్కుతుంది.
మరి ఈ సినిమాని ప్రేక్షకులను ఎలా ఆదరిస్తారు. నాని క్యారెక్టర్ ను ఎలా పోట్రె చేయగలుగుతాడు అనేది తెలియాల్సి ఉంది…
