సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు యువత మెదడులో ఎన్నో ఆలోచనలు చక్కర్లు కొడుతుంటాయి. దానికి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరు పెట్టుకుంటారు. సిగరెట్ తాగకుండా ఉండాలని.. మందు కొట్టకుండా నిగ్రహాన్ని ప్రదర్శించాలని.. జంక్ ఫుడ్ తినకుండా నిష్టగా జీవించాలని అనుకుంటారు.. చక్కగా చదువుకోవాలని.. బుద్ధిగా ఉండాలని.. నైట్ అవుట్ చేయకుండా వేళకు పడుకోవాలని.. జిమ్ లో కసరత్తులు చేయాలని.. ముందుకొస్తున్న పొట్టను కలిగించాలని అనుకుంటారు. అయితే ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం నూటికి 95 శాతం మంది న్యూ ఇయర్ రిజర్వేషన్స్ కొనసాగించడం లేదట. అయితే ఈసారి మన దేశంలో యువత ధోరణి మారిందట. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ను డిసెంబర్లోనే మొదలుపెట్టారట. కొత్త అలవాట్లను ప్రారంభించారట.. పాత అలవాటులను నెమ్మదిగా వదిలించుకుంటున్నారట. కొత్త ఏడాది తీర్మానాలు మొదలుపెట్టారట. డిసెంబర్ నుంచే మెల్లమెల్లగా వీటిని అమలు చేయడం మొదలుపెట్టారట..”కొంతమంది స్మోకింగ్ మానేస్తున్నారు. మరి కొంతమంది డ్రింకింగ్ హాబిట్ ను వదిలేస్తున్నారు. జిమ్ లకు వెళ్తున్నారు. యోగా చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆలయాలకు వెళ్తున్నారు. పుస్తకాలను చదువుతున్నారు. సెల్ ఫోన్ లను దూరం పెడుతున్నారు. ఇలాంటి ధోరణి యువతలో ఇప్పుడే పెరగడం మంచి పరిణామంగా కనిపిస్తోందని” సైకాలజిస్ట్ లు అంటున్నారు.
ఎందుకిలా..
న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్న తీర్మానాలు అమలు చేయకపోవడంతో వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతోంది. అది యువతను తీవ్రంగా ఆలోచింపజేసింది. అందువల్లే జనవరి మంచి మొదలు పెట్టకుండా.. డిసెంబర్ నుంచే ప్రారంభించడం వల్ల అసలు మ్యాచ్ కు ముందు నెట్ ప్రాక్టీస్ లాగా ఉంటుందని యువత ఆలోచిస్తున్నది. అందువల్లే 2025 న్యూ ఇయర్ తీర్మానాలను 2024లోనే అమలు చేయడం మొదలుపెట్టింది..” కొంతకాలంగా మా జిమ్ కు వచ్చే యువత సంఖ్య పెరిగింది. గత ఏడాది డిసెంబర్లో ఇలా ఉండేది కాదు. కానీ ఈ ఏడాది వారి సంఖ్య పెరిగింది. జిమ్ తోపాటు యోగా చేస్తున్నారు. మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. జంక్ ఫుడ్ తినడం లేదు.. సమతుల ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు జిమ్ కు వచ్చే విషయంలో సమయపాలన పాటిస్తున్నారు. యువత ధోరణి పూర్తిగా మారిపోయింది. ఏదో చేయాలి అనే కసి పెరిగిపోయింది. అందువల్లే వారు ఇలా ఉండగలుగుతున్నారు.. ఇది మారుతున్న యువత ఆలోచనకు సంకేతంలాగా ఉందని” హైదరాబాదులోని ఓ జిమ్ నిర్వాహకుడు చెబుతున్నారు.. కేవలం జిమ్ లు మాత్రమే కాదు, పబ్ లకు వెళ్లకుండా, దమ్ము కొట్టకుండా, మందు తాగకుండా ఉంటున్న వారి సంఖ్య కూడా ఇటీవల పెరిగిందని సైకాలజిస్టులు చెప్తున్నారు.