white gold : బంగారం విషయానికి వస్తే, చాలా మంది ప్రజలు మెరిసే పసుపు లోహం గురించి అదేనండి బంగారం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకు చించరు? బంగారం ఒక మంచి సంపద. హోదాకు చిహ్నంగా కనిపిస్తుంది. నగలలో లేదా పొదుపులో ఎవరైనా ఎక్కువ బంగారం ఉంటే చాలు వారిని కాస్త స్పెషల్ గా చూస్తారు. వారి గురించి టాక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక బంగారం స్వచ్ఛత, ధర క్యారెట్లలో కొలుస్తారు. అయితే, ఈ రోజు, మనం అందరికీ తెలియని విభిన్నమైన బంగారం గురించి మాట్లాడుతున్నాము. అంటే తెల్ల బంగారం గురించి. ఇంతకీ ఈ తెల్లబంగారం అంటే ఏంటి అనుకుంటున్నారా?
వైట్ గోల్డ్ అంటే ఏమిటి?
సాంప్రదాయ పసుపు బంగారం నుంచి తెల్ల బంగారం భిన్నంగా ఉంటుంది. 24-క్యారెట్ స్వచ్ఛమైన బంగారం పసుపు రంగులో ఉంటూ మెరుస్తుంది. అయితే, తెలుపు బంగారం అంటే కొందరు రైతులు పత్తిని కూడా తెల్ల బంగారం అంటారు. కానీ ఇక్కడ మీరు పొరపాటు పడవద్దు. పత్తి కాదు. అయితే ప్లాటినం లేదా వెండితో సమానమైన వెండి-తెలుపు రంగును కలిగి ఉంటుంది. స్వచ్ఛమైన 24-క్యారెట్ బంగారం ఆభరణాలలో ఉపయోగించడానికి చాలా మృదువైనది. తెల్ల బంగారాన్ని సృష్టించేందుకు, నికెల్, జింక్ వంటి లోహాలు స్వచ్ఛమైన బంగారంతో కలుపుతారు. ఈ ప్రక్రియ దాని రంగును మారుస్తుంది. మరింత మన్నికైనదిగా చేస్తుంది.
వైట్ గోల్డ్ లక్షణాలు
తెల్ల బంగారం తరచుగా ప్లాటినంకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది సాధారణంగా 75 శాతం బంగారం, 25 శాతం నికెల్, జింక్ కలిగి ఉంటుంది. సాధారణంగా 14-క్యారెట్, 18-క్యారెట్ వేరియంట్‌లలో లభిస్తుంది. వీటిలో, 14-క్యారెట్ తెలుపు బంగారం బలమైనది. మన్నికైనది. ప్లాటినమ్‌తో పోలిస్తే వైట్ గోల్డ్ కూడా చాలా సరసమైనది, అదే రూపాన్ని అందిస్తోంది. ఇక తెలుపు బంగారం పసుపు బంగారం కంటే గట్టిది. తక్కువ పాలిషింగ్ అవసరం.
వైట్ గోల్డ్ ధర
పసుపు బంగారం కంటే తెల్ల బంగారం చాలా ఖరీదైనది. ప్రధానంగా దానిని సృష్టించే ప్రక్రియ కారణంగా దీని ధర కాస్త ఎక్కువ ఉంటుంది. తెల్ల బంగారాన్ని తయారు చేయడానికి రోడియం కావాలి. ఇది అరుదుగా లభిస్తుంది. ఖరీదైన లోహంతో సహా అనేక దశలు అవసరం. రోడియం పూత తెలుపు బంగారం ప్రకాశాన్ని పెంచుతుంది. ఇది మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
దీని మెరుపు, మన్నికను మెరుగుపరచడానికి ఇతర విలువైన లోహాలు కలపడం వల్ల దాని ధరను మరింత పెరుగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసుపు బంగారం ధర రూ. 76,000, రూ. 78,000, ఈ అదనపు కారకాల కారణంగా తెల్ల బంగారం ధర మరింత ఎక్కువగా ఉంది.