PAK vs BAN : ఆటగాళ్ళే గ్రౌండ్స్ మెన్.. అభిమానులకు సరిగ్గా కుర్చీలు లేవు.. ఇటువంటి క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తుందట..

ఆమధ్య పాకిస్థాన్ లోని పెషావర్ క్రికెట్ స్టేడియంలో విపరీతంగా గడ్డి పెరిగింది. దాన్ని కత్తిరించేందుకు యంత్రాలు లేక.. కూలీలతో కోయించారు . అప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి

Written By: Anabothula Bhaskar, Updated On : August 21, 2024 5:17 pm

pakistan Cricket board

Follow us on

PAK vs BAN :  నెట్టింట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దుస్థితి చర్చకు దారితీస్తోంది. కనీసం మైదానాలను సిద్ధం చేసే సిబ్బంది కూడా అక్కడ లేరు.. బుధవారం నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్ట్ కు వర్షం అడ్డంకి గా మారింది. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది.. విపరీతంగా వర్షం కురవడంతో మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు. మైదానం పూర్తిగా చిత్తడిగా మారిపోయింది. దీంతో టాస్ వేసే అవకాశం కూడా లేకపోయింది. చిత్తడిగా మారిపోయిన మైదానాన్ని ఆటకు సిద్ధం చేసేందుకు అక్కడ సహాయక సిబ్బంది లేరు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లే గ్రౌండ్స్ మెన్ అవతారం ఎత్తారు. మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ” ఇటువంటి క్రికెట్ బోర్డు భారత జట్టుపై మండిపడుతుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కనీసం గ్రౌండ్స్ మెన్ కూడా లేరు. సిగ్గుపడండి మీ క్రికెట్ బోర్డు దుస్థితి చూసి.. కనీసం గ్రౌండ్ మెన్స్ ను ఏర్పాటు చేసుకోలేని మీ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా నిర్వహిస్తుంది? అసలు క్రికెటర్లు మైదానాన్ని సిద్ధం చేయడం ఏంటి? మా క్రికెట్ మేనేజ్మెంట్ను చూసి నేర్చుకోండని” భారత నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ను అధికారిక ట్విట్టర్ ఐడిని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఉదయం 9 గంటలకు ప్రారంభం కావలసిన మ్యాచ్ ఇంతవరకు మొదలు కాలేదు.

ఇక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అంపైర్లు వచ్చారు. 2:30 తర్వాత మ్యాచ్ మొదలు పెడతామని ప్రకటించారు. తొలి రోజు మ్యాచ్ 90 ఓవర్ల పాటు సాగాల్సి ఉండగా.. వర్షం వల్ల మైదానం సహకరించకపోవడంతో 48 ఓవర్లకు తగ్గించారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు వర్షం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో తొలిరోజు మ్యాచ్ నిర్వహణను 30 నిమిషాలకు పెంచారు. మరోవైపు మైదానంలో సీట్లు కూడా లేవు. దీంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వేసే కుర్చీలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసింది. అయితే వీటిని కూడా కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ” ఇదీ ఆర్థిక దరిద్రానికి నిదర్శనం. కనీసం కుర్చీలు కూడా వేయలేరు. వేసేంత స్తోమత కూడా లేదా. కొంచెం కూడా సిగ్గు అనిపించడంలేదా.. ఇలాంటి దిక్కుమాలిన దేశంలో క్రికెట్ ఎందుకు చూడాలి? అసలు ఎలా చూడాలి? మీరూ మీ దిక్కుమాలిన బుద్ధులు అంటూ” సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ పెదవి విప్పకపోవడం విశేషం.