Yamadonga: ‘యమదొంగ’ చిత్రంలో యముడి పాత్రని మిస్ చేసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

డైరెక్టర్స్ కి ఒక్కోసారి ఒకరి కోసం అనుకున్న పాత్రని మరొకరితో చేయించాల్సి వస్తుంది. అలా చెయ్యడం వల్ల కొన్ని సార్లు సక్సెస్ లు వస్తాయి, కొన్నిసార్లు ఫ్లాప్స్ కూడా వస్తుంటాయి. యమదొంగ సినిమాలో మోహన్ బాబు చేసిన యముడి పాత్ర కూడా అలాంటిదే.

Written By: Vicky, Updated On : August 21, 2024 5:06 pm

Yamadonga

Follow us on

Yamadonga: జూనియర్ ఎన్టీఆర్ -రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం యమదొంగ. వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఎన్టీఆర్ కి ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ కెరీర్ ని ‘యమదొంగ’ కి ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. లుక్స్ కూడా ఈ చిత్రం నుండి ఎన్టీఆర్ వి ఎలా మారిపోయాయో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ తో సరిసమానంగా మోహన్ బాబు యముడి పాత్రలో ఎంత అద్భుతంగా నటించాడో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్ర గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

Also Read: సెప్టెంబర్ 2న ‘ఓజీ’ ఫ్యాన్స్ కి పండగే..క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత డీవీవీ దానయ్య!

డైరెక్టర్స్ కి ఒక్కోసారి ఒకరి కోసం అనుకున్న పాత్రని మరొకరితో చేయించాల్సి వస్తుంది. అలా చెయ్యడం వల్ల కొన్ని సార్లు సక్సెస్ లు వస్తాయి, కొన్నిసార్లు ఫ్లాప్స్ కూడా వస్తుంటాయి. యమదొంగ సినిమాలో మోహన్ బాబు చేసిన యముడి పాత్ర కూడా అలాంటిదే. ముందుగా ఈ పాత్ర కోసం అలనాటి నటుడు నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ ని తీసుకోవాలని అనుకున్నాడట రాజమౌళి. యముడు అంటే ఇలాగే ఉంటాడు అని అనిపించే రేంజ్ లో కైకాల సత్యనారాయణ జనాల్లో ఒక ముద్ర వేసాడు. ఆ పాత్ర ని ఆయన తప్ప ఎవ్వరూ చెయ్యలేరని రాజమౌళి అభిప్రాయం. ఆ పాత్ర కోసం కైకాల సత్యనారాయణ ని రాజమౌళి సంప్రదించగా, ఇప్పుడు నాకు వయస్సు సహకరించడం లేదని, ఒకప్పుడు ఉన్న ఎనర్జీ తో నటించలేనని, ఈ పాత్రకి ఇప్పుడైతే కేవలం మోహన్ బాబు మాత్రమే న్యాయం చేయగలడని కైకాల రాజమౌళి కి సూచించాడట. దాంతో రాజమౌళి మోహన్ బాబు ని సంప్రదించడం, మోహన్ బాబు కూడా వెంటనే ఒప్పుకొని ఆ సినిమా చెయ్యడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

2007 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 30 కోట్లు పైగానే షేర్ వసూళ్లను రాబట్టింది. వరుస ఫ్లాప్స్ తో స్టార్ స్టేటస్ మసకబారే స్థితికి వచ్చేసిన ఎన్టీఆర్ కి మళ్ళీ ఊపిరి పోసింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అదే తరహా లుక్స్ ని మైంటైన్ చేస్తూ నేడు పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చేనెల 27 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారం లో దేవర కి సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియా ఊగిపోతుందని అంటున్నారు మేకర్స్, చూడాలి మరి.

Also Read: ‘ఇంద్ర’ కి ఇద్దరు డైరెక్టర్లు పనిచేసారు..ఆ రెండో డైరెక్టర్ ఇండస్ట్రీ లోనే పెద్ద స్టార్ హీరో..ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు!