IND VS BAN T 20 Match : భారత్ విధించిన 297 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో బంగ్లాదేశ్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 164 రన్స్ మాత్రమే చేసింది. ఈ విజయం ద్వారా భారత్ 3-0 తేడాతో సిరీస్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే భారత్ అనేక రికార్డులను కొల్లగొట్టింది. టి20 లో మూడవ అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే భారీ స్కోర్ చేసిన జట్లపరంగా చూసుకుంటే.. భారత్ రెండో స్థానంలో ఉంది. 2023లో మంగోలియా జట్టుపై జరిగిన మ్యాచ్లో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 రన్స్ చేసింది. టి20లలో హైయెస్ట్ స్కోర్ చేసిన టీం గా నేపాల్ కొనసాగుతోంది. తర్వాతి స్థానంలో టీమిండియా ఉంది. 2024 బంగ్లాదేశ్ జట్టు పై హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 297 రన్స్ చేసింది. 2019లో ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 278 రన్స్ చేసింది. ఇది మూడవ హైయెస్ట్ టీం స్కోర్ గా కొనసాగుతోంది. 2019లో టర్కీ జట్టు పై చెక్ రిపబ్లిక్ నాలుగు వికెట్ల నష్టానికి 278 రన్స్ చేసింది. ఇది నాలుగో టీం హైయెస్ట్ స్కోర్ గా నిలిచింది. థాయిలాండ్ పై 2023లో జరిగిన మ్యాచ్లో మలేషియా నాలుగు వికెట్ల నష్టానికి 268 రన్స్ చేసింది. ఇది ఐదవ అత్యధిక స్కోరుగా కొనసాగుతోంది.
ఒక క్యాలెండర్ ఇయర్లో 200+ స్కోర్ విభాగంలో..
టీమిండియా బంగ్లాదేశ్ జట్టుపై మూడవ టి20 లో 297 రన్స్ చేసింది. మొత్తంగా టి20 చరిత్రలో టీమిండియా 37వ సారి చేసిన 200+ స్కోర్ ఇది. టి20 చరిత్రలో ఏ జట్టు కూడా ఇలాంటి రికార్డు నమోదు చేయలేదు.
ఇక టి20 లలో ఒక కేలండర్ ఇయర్లో అత్యధిక 200 ప్లస్ స్కోర్ చేసిన జట్ల వివరాలను పరిశీలిస్తే.. 2023లో భారత్ ఏడుసార్లు 200+ స్కోర్ చేసి… జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 2024లో జపాన్ జట్టు ఏడుసార్లు 200+ స్కోర్ చేసి రెండో స్థానంలో ఉంది.. 2022లో ఇంగ్లాండ్ జట్టు ఆరుసార్లు, 2022లో దక్షిణాఫ్రికా ఆరుసార్లు, 2024లో టీమ్ ఇండియా ఆరుసార్లు ఈ ఘనతను అందుకున్నాయి. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలిచి.. ట్రోఫీ అందుకుంది. టి20 ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో కొనసాగుతోంది.