https://oktelugu.com/

Sumanth : ఈ సంక్రాంతి కి రామ్ చరణ్, బాలయ్య లతో పోటీ పడుతున్న సుమంత్…ఆయన ధైర్యం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ చాలా కష్టపడి మరి ఒక కథను రెడీ చేసుకుని ప్రొడ్యూసర్ ను ఒప్పించి తన విజన్ తో సినిమాని తెరకెక్కిస్తూ ఉంటాడు. ఇక కథ బాగున్నప్పటికి డైరెక్టర్ కి ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ వల్లే సినిమా అవుట్ ఫుట్ నెక్స్ట్ లెవెల్ లో వస్తుంటుంది. అందువల్లే ఒక సినిమా చేయాలంటే దర్శకుడి దగ్గర గత ఎంత బాగున్నా కూడా దాన్ని డీల్ చేసే విధానం అనేది అంతకంటే గొప్పగా ఉండాలి. అలాంటప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : October 13, 2024 / 01:42 PM IST

    Sumanth

    Follow us on

    Sumanth : ఇండస్ట్రీ లో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానికి స్టార్ హీరోలు భారీ బడ్జెట్ ఉండాల్సిన అవసరం లేదు. మంచి కథ, కథనం ఉంటే సినిమా సక్సెస్ సాధిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో మూవీ చేయడం ఒకేత్తైతే, దానిని సరైన సమయంలో రిలీజ్ చేయడం మరొక ఎత్తు… అందుకే చాలామంది దర్శక నిర్మాతలు వాళ్ళ సినిమాలను ఫెస్టివల్ ని బేస్ చేసుకుని రిలీజ్ చేస్తూ ఉంటారు. అప్పుడైతే సినిమాని చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఉద్యోగస్థుల వరకు ప్రతి ఒక్కరికి హాలీ డేస్ కూడా ఉంటాయి. కాబట్టి సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక అందులోనూ సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద పండగనే చెప్పాలి. అందువల్లే ఒక 6 నెలల ముందు నుంచే సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలు బరి లో ఉన్నాయంటూ స్టార్ హీరోలు కర్చీఫ్ వేసి మాటి కూర్చుంటారు. దీనివల్ల మిగతా హీరోలు తమతో పోటీకి ఎవరు రాకుండా ముందు నుంచి జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మిగతా హీరోలు కూడా వాళ్ళ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక పెద్ద సినిమాలకు పోటీగా మరొక పెద్ద సినిమా వస్తే ఇబ్బంది ఏమీ ఉండదు.

    కానీ పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా వచ్చినప్పుడు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు. కానీ నెగెటివ్ టాక్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక అందువల్లే చిన్న సినిమా దర్శకులు, నిర్మాతలు తమ కంటెంట్ ను నమ్ముకొని సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా 2017 వ సంవత్సరంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలయ్య బాబు గౌతమీపుత్ర శాతకర్ణి తో పాటు శతమానం భవతి సినిమా రిలీజ్ అయింది. ఇక చిరంజీవి బాలయ్యలకు షాక్ ఇస్తు శర్వానంద్ హీరోగా వచ్చిన ‘శతమానం భవతి’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అంటే ఇక్కడ స్టార్ స్టేటస్ తో పని లేకుండా కంటెంట్ మీదనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందనేది చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది… ఇక 2025 సంక్రాంతి బరిలో ఇప్పటికే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. అలాగే బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా కూడా ఈ సంక్రాంతికే వస్తుంది.

    మరి ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూడు పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా కూడా సంకాంత్రి బరిలో నిలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా రీసెంట్ గా రాజమండ్రి, హైదరబాద్ లోని కొన్ని లొకేషన్స్ లలో షూటింగ్ జరుపుకుంది. ఇక ఇప్పుడు హంపి, అస్సాంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించి తొందర్లోనే మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు. నిజానికి స్టార్ హీరోలను ఢీ కొడుతూ వీళ్ళు సంక్రాంతి బరిలో నిలవడానికి గల కారణం ఏంటి? అసలు వీళ్ల ధైర్యం ఏంటి అంటూ సినిమా పెద్దలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక వంతుకు మహేంద్రగిరి వారాహి సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ చాలా వరకు రిస్క్ చేస్తున్నారని సినీ విమర్శకులు కూడా వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమా యూనిట్ మాత్రం ఇది రిస్క్ కాదని, మేము రాసుకున్న కథ, మేము తీసిన సినిమానే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని చెబుతున్నారు. ఎంతో ధైర్యం ఉంటే తప్ప ఒక చిన్న సినిమా ని స్టార్ హీరోలతో పోటీకి దింపలేరు. మరి వీళ్ళ కంటెంట్ లో దమ్ముంది కాబట్టే ‘మహేంద్ర గిరి వారాహి’ సినిమాని సంక్రాంతికి దింపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే ప్రేక్షకుడిలో ఒక క్యూరియాసిటీ అయితే కలుగుతుంది.

    ఇక ఇప్పటి వరకు తీసిన సీన్ల తాలూకు ఔట్ పుట్ కూడా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా వచ్చిందని డైరెక్టర్ సంతోష్ జగర్లపూడి సినిమాను బాగా డీల్ చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…ఇక అమ్మవారి అనుగ్రహంతో తెరకెక్కుతున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా తప్పకుండా సంక్రాంతి బరిలో నిలిచి అలాగే ప్రేక్షకులను అలరించి బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధిస్తుందనే ఒక పాజిటివ్ వైబ్ కూడా ప్రేక్షకులలందరిలో క్రియేట్ అవుతున్నాయి…