https://oktelugu.com/

Rajinikanth-Mani Ratnam : దళపతి తర్వాత రజినీకాంత్ మణిరత్నం తో మరో సినిమా ఎందుకు చేయడం లేదు…

తెలుగులో ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్నప్పటికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం రజినీకాంత్ లాంటి స్టార్ హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన సినిమాలను చేయడమే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 13, 2024 / 12:33 PM IST

    Rajinikanth-Mani Ratnam

    Follow us on

    Rajinikanth-Mani Ratnam :  తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వాళ్లలో రజినీకాంత్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇంకా పాన్ ఇండియా రేంజ్ లో ఆయన సినిమాలకి ఎక్కువ గుర్తింపు రావడమే కాకుండా సినిమాలన్నింటితో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన సినిమాల మీద సగటు ప్రేక్షకుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా రికార్డు బ్రేకింగ్ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయాలని కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనదైన రీతిలో ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయం పక్కన పెడితే ఒకప్పుడు మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ చేసిన ‘ దళపతి ‘ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. మహాభారతంలోని కర్ణుడి స్టోరీని ఆధారంగా చేసుకొని తీసిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడి హృదయాన్ని కలచివేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి అలాంటి మణిరత్నం తో రజినీకాంత్ మరొక సినిమా చేయలేకపోయాడు.

    కారణం ఏదైనా కూడా వీళ్ళ కాంబినేషన్ మరొకసారి సెట్ కాకపోవడం అనేది అటు మణిరత్నం అభిమానులను, ఇటు రజనీకాంత్ అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. అయితే వీళ్ళు మరొక సినిమా చేయాలని చాలా సార్లు అనుకున్నప్పటికి కథ సెట్ అవ్వక పోవడం వల్లే వీళ్ళ కాంబో సెట్ అవ్వలేదు…ఇక వీళ్ళ కాంబో కనక సెట్ అయితే అది ఇండస్ట్రీ హిట్ గా మిగిలేది అంటూ చాలామంది చాలాసార్లు చెప్పడం విశేషం…

    మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ ను హీరోగా పెట్టి ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి మణిరత్నం – రజనీకాంత్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే మాత్రం ఒక మంచి కథ కుదరాల్సిందే అని ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ప్రస్తుతం రజనీకాంత్ చేసిన వేట్టయన్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేక పోయింది. కాబట్టి ఇప్పుడు లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న కూలీ సినిమా మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…