Neeraj Chopra: ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ నుంచి నీరజ్ చోప్రా అవుట్.. కారణమేంటంటే..

Neeraj Chopra: ఏడాది మే 15న భువనేశ్వర్ లో జరిగిన 27వ జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పురుషుల జావెలిన్ త్రో లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 27, 2024 2:00 pm

Neeraj Chopra Pulls Out Of Ostrava Golden Spike

Follow us on

Neeraj Chopra: భారత ఏస్ అథ్లెట్ నీరజ్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జావెలిన్ త్రో విభాగంలో అతడు సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఒలింపిక్స్ లో ఏకంగా స్వర్ణ పతకాన్ని సాధించాడు. హర్యానా(Haryana) రాష్ట్రానికి చెందిన నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో లో చిన్నప్పటి నుంచే మక్కువ పెంచుకున్నాడు. ఆ గేమ్ లో అద్భుతమైన ప్రతిభ చూపి ఒలంపిక్ విజేతగా నిలిచాడు. తొలిసారి ఆ క్రీడా విభాగంలో మన దేశానికి స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత టి20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో మహిళా క్రీడాకారిణులకు ఒత్తిడిని జయించడం ఎలాగో నేర్పించాడు. అయితే ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో భారత మహిళా జట్టు ఓడిపోయినప్పటికీ.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో నీరజ్ చోప్రా తీవ్రంగా కృషి చేశాడు.

ఏడాది మే 15న భువనేశ్వర్ లో జరిగిన 27వ జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పురుషుల జావెలిన్ త్రో లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే అదే ఉత్సాహంతో మే 26న ప్రారంభమైన ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్(Ostrava Golden Spike) పోటీలలో పాల్గొంటారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆ టోర్నీ నుంచి వైదొలిగాడు. “అందరికీ నమస్కారం ఇటీవల శిక్షణ తీసుకుంటుండగా ట్రైనర్ నాకు కొన్ని సూచనలు చేశాడు. నేను ఆస్ట్రావా టోర్నీలో పాల్గొనదని సూచించాడు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. ఆ గాయం వల్ల నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నా పరిస్థితిని గమనించి నా ట్రైనర్ విశ్రాంతి తీసుకోవాలని విన్నవించాడు. ఒకవేళ విశ్రాంతి తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించాడని” నీరజ్ చోప్రా ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నాడు. “నేను ఒలంపిక్ సంవత్సరంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దని అనుకుంటున్నాను. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను పూర్తిగా కోలుకున్న తర్వాత పోటీలలో పాల్గొంటాను. మీ అందరి మద్దతుకు నా ధన్యవాదాలు” అంటూ నీరజ్ పేర్కొన్నాడు..” శిక్షణలో ఉండగా రెండు వారాల క్రితం అయిన గాయం వల్ల నీరజ్ చోప్రా ఆస్ట్రావా టోర్నీలో పాల్గొనలేరు. కానీ ఆయన అతిధిగా ఆ కార్యక్రమానికి వస్తారని” నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

” ఈ టోర్నీలో జర్మనీకి చెందిన యూరోపియన్ ఛాంపియన్ జూలియన్ వెబర్ పాల్గొన్నారు. గత శుక్రవారం ఆయన 88.37 మీటర్ల మేర ఈటను విసిరి రికార్డ్ సృష్టించారు. ఈ సంవత్సరంలో మూడవ అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించారు. ఆయన అదే ఊపులో ఆస్ట్రావా టూర్నికి వస్తాడు.. ఇది జాకుబ్ వడ్లెజ్ అనే క్రీడాకారుడికి పెద్ద పరీక్ష అవుతుందని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. జూలియన్ వెబర్ మే 10న దోహాలో జరిగిన డైమండ్ లీగ్ లో 88.36 మీటర్ల మేర విసిరి రజత పతకాన్ని సాధించాడు.. ఇక నీరజ్ చోప్రా మే 15న ఫెడరేషన్ కప్ లో 82.27 మీటర్ల మేర ఈటను విసిరి బంగారు పత కాన్ని సాధించాడు… ఆ టోర్నీలో డీపీ మను రెండో స్థానంలో నిలిచాడు. టోక్యో ఒలంపిక్స్ లో చోప్రా బంగారు పతకాన్ని సాధించాడు. ఆ ఘనతను పారిస్ ఒలంపిక్ క్రీడల్లో పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. అందువల్లే ఎక్కువగా రిస్క్ తీసుకోవడం లేదని చెప్తున్నాడు.

Deepa Karmakar : దీపా కర్మాకర్ సరికొత్త ఘనత.. తొలి భారత అథ్లెట్ గా చరిత్ర..

Kavya Maran: కళ్ళముందే జట్టు ఓటమి.. కావ్య కళ్ళ నిండా కన్నీరు.. ఆ బాధను ఎవరు తీర్చగలరు?