https://oktelugu.com/

Hardik Pandya: ఏరి కోరి చేసుకున్నందుకు ఇచ్చే గౌరవం ఇదా.. టీమిండియా స్టార్ ఆటగాడి సతీమణి పై ఫ్యాన్స్ ఫైర్..

టీమిండియా 17 సంవత్సరాల గ్యాప్ తర్వాత పొట్టి ప్రపంచ కప్ గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 3, 2024 / 08:01 AM IST

    Hardik Pandya

    Follow us on

    Hardik Pandya: ” ఎక్కడో ఉన్న నిన్ను ఇండియాకు తీసుకొచ్చాడు. అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే.. నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రేమలో పడ్డాడు. చివరికి తనదాన్ని చేసుకున్నాడు. అతడికి భార్య అయినందువల్లే నీకు అద్భుతమైన గౌరవం లభించింది. ఈ దేశం నిన్ను గొప్పగా స్వీకరించింది. కానీ చివరికి నువ్వేం చేసావ్.. ఏం చేస్తున్నావ్.. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని మోసం చేస్తున్నావ్.. చివరికి అతడు భారతదేశ విజయంలో కీలకపాత్ర పోషించినప్పటికీ శుభాకాంక్షలు తెలియజేయలేకపోతున్నావంటూ” సోషల్ మీడియాలో ఓ స్టార్ క్రికెటర్ అభిమానులు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

    టీమిండియా 17 సంవత్సరాల గ్యాప్ తర్వాత పొట్టి ప్రపంచ కప్ గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు నేపథ్యంలో టీమిండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమ్ ఇండియా ను గెలిపించిన హార్దిక్ పాండ్యా పై దేశం యావత్తు శుభాకాంక్షలు చెబుతోంది. శనివారం టీమిండియా గెలిచిన నాటి నుంచి నేటి వరకు సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా ట్రెండింగ్ పర్సనాలిటీగా ఉన్నాడు. అయితే దేశం యావత్తు, ప్రపంచంలో ఉన్న భారత అభిమానులు హార్దిక్ పాండ్యాకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటే.. ఒక మహిళ మాత్రం అసలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీసం సోషల్ మీడియా వేదికగానైనా శుభాకాంక్షలు తెలియజేయలేకపోయింది. దీంతో ఆమెపై హార్దిక్ పాండ్యా అభిమానులు మండిపడుతున్నారు.

    హార్దిక్ పాండ్యా నటాషా అనే విదేశీ మోడల్ ను గతంలో పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి పెళ్లికి ముందే నటాషా గర్భవతి. ఆ తర్వాత ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. కొద్దిరోజులపాటు హార్దిక్ – నటాషా అత్యంత అన్యోన్యంగా ఉన్నారు. హార్దిక్ గెలిచిన మ్యాచ్లలో ప్రముఖంగా అభినందిస్తూ నటాషా శుభాకాంక్షలు తెలియజేసేది. అతడు ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరయ్యేది. అయితే ఇటీవలి ఐపిఎల్ నుంచి నటాషా హార్దిక్ ఆడే మ్యాచ్ లకు రావడం మానేసింది. చివరికి ముంబై కెప్టెన్ గా హార్దిక్ కు ప్రమోషన్ వచ్చినప్పటికీ కనీసం శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీంతో దాల్ మే కుచ్ కాలా హై అన్నట్టుగా చాలామంది ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించారు. ఫలితంగా అసలు విషయం వెలుగు చూసింది.

    నటాషా – హార్దిక్ మధ్య విభేదాలు పొడచూపాయని.. విడాకులు తీసుకున్నారని అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. జాతీయ మీడియా కూడా ఈ విషయంపై కోడై కూసింది.. వీటికి తగ్గట్టుగానే హార్దిక్ – నటాషా ప్రవర్తన ఉండడంతో చాలామంది విడాకులు తీసుకున్నారని ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ విషయంపై అటు హార్దిక్, ఇటు నటాషా ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా, హార్దిక్ పాండ్యా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించినప్పటికీ.. కనీసం నటాషా శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీంతో ఆమె వ్యవహార శైలిపై ఫాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదని శాపనార్థాలు పెడుతున్నారు.