Horoscope Today: ఈరోజు గజకేసరి యోగం..ఈ రాశుల వారు నక్క తోకను తొక్కినట్లే..

సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శత్రువుల్లో కొందరు మీపై ప్రయోగాలు చేస్తారు.

Written By: Chai Muchhata, Updated On : July 3, 2024 7:53 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 జూలై 3 బుధవారం రోజున ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోపు గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి:
ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. వృద్ధులకు సేవ చేయడానికి ముందుకు వస్తారు.

వృషభ రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శత్రువుల్లో కొందరు మీపై ప్రయోగాలు చేస్తారు.

మిథున రాశి:
విహార యాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామికి బహుమతిని అందిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటాయి. వ్యాపారస్తులు విదేశాలకు వెళ్లే అవకాశం.

కర్కాటక రాశి:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి.

సింహారాశి:
స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు. జీవిత భాగస్వామి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. విహార యాత్రలకు వెళ్తారు.

కన్య రాశి:
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టబడులు పెడుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు.

తుల రాశి:
కొన్ని విషయాల్లో అనసవర వాదనలు వద్దు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చిక రాశి:
పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల వృద్ధి చెందుతారు.

ధనస్సు రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

మకర రాశి:
అనుకోని ఆదాయం వస్తుంది. సంబంధాల్లో చీలిక ఏర్పడవచ్చు. ఉద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి డబ్బు అందుతుంది.

కుంభరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. హాని కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి సలహా అవసరం. తల్లిదండ్రులకు సేవ చేయడానికి ముందుకు వస్తారు.

మీనరాశి:
భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.సోదరుల సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం.