టెస్టుల్లోకి నటరాజన్.. వైస్ కెప్టెన్ గా రోహిత్

ఆస్ట్రేలియా సిరీస్ కు నటరాజన్ కు పిలుపు వచ్చింది. టీమిండియా యువ పేసర్ నటరాజన్ కు మరోసారి అదృష్టం వరించింది. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు సన్ రైజర్ హైదరాబాద్ బౌలర్ ఎంపికయ్యాడు. Also Read: రోహిత్‌ ఇన్‌.. విహారీ ఔట్‌..! రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నటరాజన్ ఎంపికయ్యాడు. బుధవారమే జట్టులో చేరిన రోహిత్ శర్మకు సైతం టీమిండియా వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. చతేశ్వర్ పూజారాను ఆ బాధ్యతల నుంచి తప్పించి […]

Written By: NARESH, Updated On : January 2, 2021 12:48 pm
Follow us on

C

ఆస్ట్రేలియా సిరీస్ కు నటరాజన్ కు పిలుపు వచ్చింది. టీమిండియా యువ పేసర్ నటరాజన్ కు మరోసారి అదృష్టం వరించింది.
ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు సన్ రైజర్ హైదరాబాద్ బౌలర్ ఎంపికయ్యాడు.

Also Read: రోహిత్‌ ఇన్‌.. విహారీ ఔట్‌..!

రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నటరాజన్ ఎంపికయ్యాడు. బుధవారమే జట్టులో చేరిన రోహిత్ శర్మకు సైతం టీమిండియా వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. చతేశ్వర్ పూజారాను ఆ బాధ్యతల నుంచి తప్పించి రోహిత్ కు కట్టబెట్టింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన జారీ చేసింది.

టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ముఖ్యంగా పేసర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అసీస్ సిరీసు కు ముందే భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ గాయపడ్డారు. ఇక అసీస్ తో మ్యాచులు ఆడుతుండగా ఇప్పటికే మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయపడ్డారు. మహ్మద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ కు బదులు నటరాజన్ జట్టులోకి వచ్చారు.

Also Read: మహేష్ బాబు పాత్రతో 2020కి డేవిడ్ వార్నర్ వీడ్కోలు

ఇప్పటికే టీమిండియాకు నెట్ బౌలర్ గా నటరాజన్ ఎంపికయ్యాడు. టీమిండియా బౌలింగ్ లో ఇబ్బందులు పడడంతో టీట్వంటీ, వన్డేలకు ఎంపికయ్యాడు. తాజాగా టెస్టులకు కూడా పిలుపునందుకోవడం విశేషం.