https://oktelugu.com/

గజగజ వణుకుతున్న ఢిల్లీ.. రైతన్న పరిస్థితేంటీ?

కొత్త ఏడాది మొదటిరోజే ఢిల్లీ నగరం గజగజ వణికిపోతుంది. జనవరి 1న ఢిల్లీలో 1.1డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు సఫ్దార్‌జంగ్ అబ్జర్వేటరీ పేర్కొంది. గత 15ఏళ్లలో ఢిల్లీలో అత్యల్పంగా నమోదైన ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఢిల్లీలో చివరిసారిగా 2006 జనవరి 8న 0.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. 2020లో జనవరిలో 2.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీటి తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యల్పంగా జనవరి 1న 1.1డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 1, 2021 8:06 pm
    Follow us on

    కొత్త ఏడాది మొదటిరోజే ఢిల్లీ నగరం గజగజ వణికిపోతుంది. జనవరి 1న ఢిల్లీలో 1.1డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు సఫ్దార్‌జంగ్ అబ్జర్వేటరీ పేర్కొంది. గత 15ఏళ్లలో ఢిల్లీలో అత్యల్పంగా నమోదైన ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం.

    ఢిల్లీలో చివరిసారిగా 2006 జనవరి 8న 0.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. 2020లో జనవరిలో 2.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీటి తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యల్పంగా జనవరి 1న 1.1డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

    ఢిల్లీలో చలిపులి పంజా విసురుతుండటంతో వాహనదారులు.. వృద్ధులు.. చిన్నారులు.. అస్తమా రోగులు ఇబ్బందులకు గురవుతున్నాయి. వీరితోపాటు గత నెలరోజులుగా ఢిల్లీల్లో రైతులు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని నిరసనలు చేపడుతున్నారు.

    తీవ్రమైన చలితో ఇప్పటికే ఎంతోమంది రైతులు మృత్యువాత పడుతున్నారు. కేంద్రం.. రైతుల మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో అన్నదాతలు నిరసనలు కొనసాగిస్తుండటం ఆందోళన రేపుతోంది.

    వణికించే చలి కారణంగా రైతులు పిట్టల్లా రాలుతున్నారని.. రైతులు చావులకు కేంద్రమే కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే శనివారం మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు.