Hardik Pandya: ముంబై ఇండియన్స్ టీం 2024 సీజన్ కోసం హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా తమ టీం లోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ట్రేడింగ్ విధానాన్ని అనుసరించి ముంబై ఇండియన్స్ టీం హార్దిక్ పాండ్య ని తమ టీం లోకి కొనుగోలు చేసింది.ఇక ఇప్పుడు ఈ విషయం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.హార్దిక్ పాండ్య కోసం ముంబై ఇండియన్స్ ఏకంగా 100 కోట్ల మేరకు చెల్లించి అతన్ని టీం లోకి తీసుకున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.
అయితే ఈ వార్తల మీద ముఫద్దల్ వోహ్రా చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి…అవి ఏంటి అంటే ముంబై ఇండియన్స్ టీం హార్దిక్ పాండ్యా కోసం వంద కోట్లు కేటాయించింది అనేది అవాస్తవం ఆయనకి 100 కోట్లు కేటాయించాల్సిన అవసరం లేదు కేవలం హైప్ కోసం మాత్రమే కొంతమంది ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారు. అంతే తప్ప వీటిలో ఎంత మాత్రం నిజం లేదు అంటూ తను చాలా స్ట్రాంగ్ గా పంద్య అభిమానులకు కౌంటర్ ఇచ్చాడు…
అయితే 2022వ సంవత్సరంలో గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా ని కొనుగోలు చేసి అతనికి ఏమాత్రం అనుభవం లేకపోయిన కూడా అతన్ని కెప్టెన్ గా నియమించింది దాంతో టైటాన్స్ టీమ్ అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా హార్దిక్ పాండ్యా కూడా ఆ సీజన్ లో గుజరాత్ టీం కి కప్పు అందించాడు. ఇక 2023 వ సంవత్సరంలో కూడా ఆ టీం ని ఫైనల్ లోకి తీసుకెళ్లి ఆ టీమ్ ని రన్నరప్ గా నిలిపాడు… ఇక దాంతో ముంబై ఇండియన్స్ టీమ్ మళ్లీ హార్దిక్ పాండ్య ని తన టీమ్ లోకి తీసుకోవాలని భావించింది. అందులో భాగంగానే టెంప్టింగ్ ఆఫర్ ని కూడా హార్దిక్ పాండ్యాకు ఇచ్చి ట్రేడింగ్ విధానం ద్వారా టీంలోకి తీసుకుంది. ఇక ప్రస్తుతం 2024వ సంవత్సరం నుంచి తనకే కెప్టెన్ గా బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. అయినప్పటికీ ప్రస్తుతం హార్దిక్ పాండ్య కి గాయం కారణంగా టీం కి దూరమయ్యాడు.
ఐపీఎల్ వరకు తను పూర్తిగా కోరుకుంటాడా లేదా అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ లేదు. ఒకవేళ తను మళ్ళీ టీంలోకి రాకపోతే మాత్రం మళ్లీ రోహిత్ శర్మ నే కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి… ఇక ఇదిలా ఉంటే గుజరాత్ టీమ్ హార్దిక్ పాండ్య ని నమ్మి కెప్టెన్ గా చేసినప్పుడు పాండ్య కూడా ఆ టీం కి కప్పు అందించాడు బాగానే ఉంది. కానీ ఆ టీం కృతజ్ఞత తీర్చుకోవడానికి ఇంకా కొన్ని రోజులు ఆ టీం వెంటే ఉంటే బాగుండేది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…