Nara Lokesh : ఏపీ పాలిటిక్స్ లో ఎక్కువగా ట్రోల్ అయ్యేది లోకేష్. లోకేష్ మాట్లాడుతున్నారంటే ఎలాంటి ఆణిముత్యాలు జాలువారుతాయోనని ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా విభాగం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆయన ప్రసంగాలు, ఇంటర్వ్యూల సారాంశాలను తీసుకొని.. మసి పూసి మారేడు కాయ చేసి ప్రత్యర్థి సోషల్ మీడియా విభాగాలు తెగ ప్రచారం చేస్తుంటాయి. తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఆయనపై జవాబులతో రెచ్చిపోయినట్లు ఉన్నది ఆ వీడియో.
పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేష్ పలు యూట్యూబ్ ఛానళ్ల కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మొన్న ఆ మధ్యన జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ షేరింగ్ గురించి మాట్లాడి జన సైనికుల ఆగ్రహానికి గురయ్యారు లోకేష్. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా చంద్రబాబు సీఎం అవుతారని.. అందులో మరో అంశానికి తావు లేదని.. పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయం ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. ఇదే వీడియోని పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా టిడిపి, జనసేన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదే అదునుగా తాజాగా మరో వీడియోను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది.
యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావిస్తారు. గత ఎన్నికల్లో జగన్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిపైనే తాను పోరాటం చేస్తున్నట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. దీనికి యాంకర్ స్పందిస్తూ 2014-19 మధ్య ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని తిరిగి ప్రశ్నించారు. మీరు ఇవ్వకుండా జగన్ ఇవ్వాలని కోరడం సమంజసమేనా అని నిలదీశారు. ఈ ప్రశ్నలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీని వెనుక వైసిపి సోషల్ మీడియా హస్తము ఉందని టిడిపి ఆరోపిస్తోంది. వీడియోలను కట్ చేసి.. తమకు అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేస్తున్నారని చెబుతోంది. ఇటువంటి వీడియోలతో లోకేష్ ను ప్రజల్లో తేలిక చేయలేరని తేల్చి చెబుతోంది.
సిగ్గులేదారా మాలోకం #EndOfTDP #PappuLokesh #TeluguDesamParty #AndhraPolitiks pic.twitter.com/jRhiaRSRxT
— Andhra Politiks (@AndhraPolitiks) December 25, 2023