WPL 2024: ఓం.. భీమ్.. బుష్.. బెంగళూరు అద్భుతం చేసింది

లక్ష్యం 135 పరుగులు మాత్రమే కావడంతో ముంబై సులభంగానే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. పైగా ముంబై డిపెండింగ్ ఛాంపియన్ గా ఉండటంతో బెంగళూరు జట్టుకు భంగపాటు తప్పదని భావించారు.

Written By: Raj Shekar, Updated On : March 16, 2024 9:18 am

WPL 2024

Follow us on

WPL 2024: ఐపీఎల్ లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అంటే మాటలు కాదు.. దూకుడుకు మారుపేరైన పొట్టి క్రికెట్లో.. తక్కువ స్కోరు చేసి విజయం సాధించడం అంటే సాహసం అనే చెప్పాలి. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బెంగళూరు అలాంటి అద్భుతాన్ని చేసింది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు పోరాడి.. విజయం సాధించింది. ఇక చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు సాధించలేక ముంబై జట్టు ఓడిపోయింది. దీంతో ఐదు పరుగుల తేడాతో స్మృతి మందాన టీం తొలిసారిగా టైటిల్ వేటకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఢిల్లీ జట్టుతో తలపడనుంది.

ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఆర్ వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.. బెంగళూరు జట్టు సోఫీ డివైన్ (10), స్మృతి మందాన (10), డిశాకసత్ (0) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. ఒకానొక దశలో 23 పరుగులకే మూడు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు ఎలిస్ ఫెర్రీ (66) ఆకట్టుకుంది. సహచరులు పెవిలియన్ చేరుతున్నప్పటికీ ఫెర్రీ మాత్రం దూకుడుగా ఆడింది. రిచా ఘోష్ (14) తో కలిసి ఐదో వికెట్ కు 35 పరుగులు, మోలినెక్స్(14) తో కలసి ఆరవ వికెట్ కు 42 పరుగులు జత చేసింది. చివరి ఓవర్ లో ఫెర్రీ అవుట్ అయినప్పటికీ.. ఆమె దూకుడైన బ్యాటింగ్ వల్ల చివరి 5 ఓవర్లలో బెంగళూరు జట్టుకు 51 పరుగులు వచ్చాయి.

లక్ష్యం 135 పరుగులు మాత్రమే కావడంతో ముంబై సులభంగానే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. పైగా ముంబై డిపెండింగ్ ఛాంపియన్ గా ఉండటంతో బెంగళూరు జట్టుకు భంగపాటు తప్పదని భావించారు. కానీ అందరి అంచనాలను బెంగళూరు జట్టు పటా పంచలు చేసింది. వాస్తవానికి ముంబై ఆటగాళ్లు పర్వాలేదు అనిపించినప్పటికీ.. 20 ఓవర్లలో ఆర్ వికెట్ల కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసింది. ముంబై జడ్పీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ (33) టాప్ స్కోరర్ గా నిలిచింది. తొలి ఎనిమిది ఓవర్లలో 50 పరుగులు చేసిన ముంబై ఓపెనర్లు మాథ్యూస్ (15), యాస్తిక (19) వికెట్లను కోల్పోయింది. సివర్(23), హర్మన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. హర్మన్ కు అమేలియా కేర్ (27 నాట్ అవుట్) జత కావడంతో ఒకానొక దశలో ముంబై గెలుస్తుందనిపించింది. అయితే 18 ఓవర్లో హర్మన్ ను శ్రేయాంక అవుట్ చేయడంతో ఒక్కసారిగా మ్యాచ్ బెంగళూరు చేతిలోకి వచ్చింది. చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరమైన వేల ఆటలో ఆద్యంతం హైడ్రామా చోటుచేసుకుంది. 19 ఓవర్లో సంజన స్టంప్ అవుట్ అయింది. దీంతో ఈక్వేషన్ కాస్త ఆరు బంతుల్లో 12 పాల్గొనకు మారింది.. క్రీజ్ లో కేర్ ఉండటంతో ముంబై జట్టుకు ఎంతో కొంత ఆశలున్నాయి. కానీ స్పిన్నర్ శోభన మాయాజాలం చేసింది. పూజ (4) వికెట్ పడగొట్టి, ఆరు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో బెంగళూరు జట్టు సంబరాలు చేసుకుంది.