Mumbai Indians Qualifier 2 History : ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై ఐదుసార్లు ట్రోఫీని అందుకుంది. మరోసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకోవడానికి అడుగులు వేస్తోంది. మరో రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు ముంబై జట్టు విజేతగా నిలుస్తుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇప్పటివరకు నాలుగు సార్లు క్వాలిఫైయర్ -2 మ్యాచ్లలో తలపడింది. ఇందులో రెండుసార్లు విజయం.. రెండుసార్లు ఓటములు ఎదుర్కొంది. అయితే రెండుసార్లుగెలిచినప్పుడుడు తుది పోటీలో కూడా విజయం సాధించి ట్రోఫీ అందుకుంది. క్వాలిఫైయర్ -2 కు ఎలిజిబిలిటీ సాధించిన సందర్భాల్లో ముంబై ఓడిపోవడం విశేషం.. 2011లో ముంబై రాయల్ చాలెంజర్స్ తో క్వాలిఫైయర్ -2 మ్యాచ్ ఆడినప్పుడు 43 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇక ఈ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా ముంబై క్వాలిఫైయర్ -2 కు అర్హత సాధించడం విశేషం. జాతీయ మీడియాలోనూ ఇదే తీరుగా కథనాలు ప్రసారమవుతున్నాయి.
Also Read : వివాదం ముగిసిపోయినా.. విరాట్ కోహ్లీని వదలని ట్రోలర్స్!
2013లో క్వాలిఫైయర్-1 లో ముంబై ఓడిపోయింది. క్వాలిఫైయర్ -2లో రాజస్థాన్ రాయల్స్ ను నాలుగు వికెట్ల తేడాతో నేల నాకించింది. నాటి ఫైనల్ మ్యాచ్లో చెన్నై జట్టును ఓడించి తొలిసారిగా టైటిల్ అందుకుంది.
2017లో క్వాలిఫైయర్ -1 లో ముంబై ఓడిపోయింది. క్వాలిఫైయర్ -2 లో కోల్ కతా పై గెలిచింది.. ఫైనల్లో పూణే జట్టును ఓడించి రెండవసారి విజేతగా నిలిచింది.
2023 సీజన్లో ఎలిమినేటర్ లో గెలిచినప్పటికీ.. క్వాలిఫైయర్ -2 లో గుజరాత్ చేతిలో భంగపడింది.
ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచినప్పుడు.. క్వాలిఫైయర్ -2 కు చేరుకున్నప్పుడు ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లలో విజయం సాధించలేదు. మొత్తంగా అయితే ప్లే ఆఫ్ లో అద్భుతమైన రికార్డు ఉంది.
ఇక పంజాబ్ జట్టు ఐపిఎల్ చరిత్రలో 2014లో క్వాలిఫైయర్ -2 లో విజయం సాధించింది. ఫైనల్ వెళ్ళినప్పటికీ కోల్ కతా చేతిలో భంగపాటుకు గురైంది. 11 సంవత్సరాల తర్వాత తొలిసారి పంజాబ్ ప్లే ఆఫ్ వెళ్ళింది. అయితే క్వాలిఫైయర్ -1 లో ఓటమిపాలైంది. మొత్తంగా క్వాలిఫైయర్ -2 లో తన లక్ ప్రదర్శించుకోనుంది. ఇప్పటికే పంజాబ్ జట్టు కెప్టెన్ అయ్యర్ తన ఉద్దేశం ఏమిటో చెప్పాడు. కన్నడ జట్టు చేతిలో మ్యాచ్ మాత్రమే ఓడిపోయామని.. తమ చేసే యుద్ధం ఇంకా మిగిలి ఉందని స్పష్టం చేశాడు. చూడబోతే ఆదివారం జరిగే మ్యాచ్లో ముంబై జట్టుకు గట్టి పోటీ ఇచ్చేలాగా తన జట్టును తీర్చి దిద్దినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పంజాబ్ జట్టులో భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. బౌలర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. మొత్తంగా చూస్తే రెండు జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.