Trolls on Virat Kohli : ఇటీవల అయ్యర్ సేనతో జరిగిన మ్యాచ్లో కన్నడ జట్టు గెలిచింది. తద్వారా నాలుగోసారి చివరి అంచె పోటీలోకి వెళ్ళింది. ఈసారి ఎలాగైనా విజేతగా నిలవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే అయ్యర్ సేనతో తలపడుతున్నప్పుడు.. కన్నడ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన నోటికి పదును చెప్పాడు. ముఖ్యంగా ముషీర్ ఖాన్ మైదానంలోకి వచ్చినప్పుడు వెకిలి వ్యాఖ్యలు చేశాడు. అప్పటిదాకా విరాట్ కోసం ఎదురుచూస్తున్న ట్రోలర్స్ కు సరైన ఆయుధం దొరికింది. ఇంకేముంది విమర్శలు మొదలుపెట్టారు. ఆరోపణలను ప్రారంభించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం షురూ చేశారు. తద్వారా విరాట్ కోహ్లీని మొన్నటి నుంచి ఒక ఆట ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వీడియోలు చేస్తూ బెంగళూరు అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు.
మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ఆట పట్టిస్తుంటాడు. తనను రెచ్చగొట్టిన వాళ్లను.. తనను ఇబ్బంది పెట్టిన వాళ్లను ఒక ఆట ఆడుకుంటాడు. అయితే ఇన్నాళ్లపాటు విరాట్ కోహ్లీ అలా చేసినప్పుడు ఎవరూ పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే తనను గెలికితే ఊరుకునే రకం విరాట్ కోహ్లీ కాదు కాబట్టి వాళ్లు సైలెంట్ అయిపోయారు. పైగా విరాట్ కోహ్లీని సమర్థించారు. అక్కడిదాకా ఎందుకు కంగారు జట్టుతో జరిగిన బి జి టి సిరీస్ లో ప్రత్యర్థి ఆటగాడిని కావాలని విరాట్ కోహ్లీ గెలికాడు. అది పెద్ద రచ్చ అయిపోయింది. అయినప్పటికీ ఆ సందర్భంలో విరాట్ కోహ్లీకి టీమిండియా అభిమానులు.. న్యూట్రల్ ఆడియన్స్ సపోర్ట్ గా నిలిచారు. ఇక ప్రస్తుత ఐపీఎల్ లో.. అయ్యర్ జట్టు తో ఫైనల్లో స్థానం కోసం తలపడుతున్న సందర్భంలో.. విరాట్ కోహ్లీ అనవసరంగా ముషీర్ ఖాన్ ను గెలుక్కున్నాడు. తన స్థాయిని మరిచి అడ్డగోలుగా విమర్శలు చేశాడు..
Also Read : ఫైనల్ లో అతడున్నాడు.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ బెంగుళూరు జట్టుదే!
విరాట్ కోహ్లీ చేసిన విమర్శలను సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. ట్రోలర్స్ మాత్రం భారీగా ఒంట పట్టించుకున్నారు. ” రోహిత్ యువ ఆటగాళ్లతో స్నేహంగా ఉంటాడు. ధోని కూడా ఈ యంగ్ ప్లేయర్లను ప్రోత్సహిస్తుంటాడు. అక్కడిదాకా ఎందుకు ఇటీవల శతకంతో చెలరేగిపోయిన బీహార్ సూర్య వంశీ మైదానంలో ధోని పాదాలకు నమస్కరించాడు. అది అతడి విధేయత. కానీ విరాట్ కోహ్లీకి అలా ఎవరు చేయరు. ఎందుకంటే అతడికి పొగరు ఉంటుంది. ఎలా మాట్లాడాలో తెలియదు. యువ ప్లేయర్లతో ఎలా మసులుకోవాలో అర్థం కాదు. అటువంటి వ్యక్తి స్టార్ ఆటగాడు ఎలా అయ్యాడో ఇప్పటికీ అర్థం కాదు. కొంచమైనా ఇంగితం ఉండాలి కదా.. ముషీర్ ఖాన్ భారతదేశానికి చెందిన ఆటగాడు. ఐపీఎల్ అనేది తాత్కాలికమైన టి20 టోర్నీ. నీళ్లు తెచ్చిన వ్యక్తి బ్యాటింగ్ చేయకూడదా. అలాంటప్పుడు విరాట్ కోహ్లీ ఎన్నో సందర్భాల్లో జట్టు ప్లేయర్ల కోసం నీళ్లు తీసుకొచ్చాడు. అలాగని అతడు క్రికెట్ కు గుడ్ బై చెప్పలేదు కదా.. బ్యాటింగ్ లోకి రాకుండా ఉండలేదు కదా” అంటూ ట్రోలర్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడంలో బెంగళూరు అభిమానులు విఫలమవుతున్నారు. ఎందుకంటే దీనికి తగ్గట్టుగా స్పందించడానికి వారి వద్ద సమాధానం లేదు.
Why Chokli Why ?? pic.twitter.com/sBYlMU3gbB
— ` (@Itz_Fl4me) May 30, 2025