MI Vs RR: మైదానం మీద తేమ ఉంది. బంతి పడటమే ఆలస్యం.. బ్యాటర్ల వైపు దూసుకొచ్చింది. ముంబై ని వణికించింది. సోమవారం రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై సొంతమైదానంలో కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవానికి ఈ ఇన్నింగ్స్ లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా నిలబడకపోయి ఉంటే ముంబై జట్టు 100 పరుగుల లోపే ఆల్ అవుట్ అయ్యేది. ముంబై ఓటమి నేపథ్యంలో నెటిజన్లు రకరకాల విమర్శలు చేస్తున్నారు. విభిన్నమైన వీడియోలతో ముంబై జట్టును ఒక ఆట ఆడుకుంటున్నారు. నెటిజన్లు చేస్తున్న విమర్శలలో ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ అదేంటంటే..
లీగ్ మ్యాచ్ లో భాగంగా మైదానం గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ.. ముంబై జట్టు బ్యాటింగ్ వైపు మొగ్గు చూపింది. దీంతో మైదానంలో ఉన్న అభిమానులు, మైదానం వెలుపల ఉన్న ప్రేక్షకులు ముంబై భారీ స్కోరు సాధిస్తుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. మైదానం మీద ఉన్న తేమను ఉపయోగించుకొని రాజస్థాన్ బౌలర్ బౌల్ట్ రెచ్చిపోయాడు. నిప్పుల్లాంటి బంతులు వేసి ముంబై ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. బౌల్ట్ వేసిన బంతుల ధాటికి ఆ జట్టులోని ముగ్గురు ప్రధాన బ్యాటర్లు 0 పరుగులకే మైదానాన్ని వీడారు. అందులో హిట్ మాన్ రోహిత్ శర్మ, నమన్ ధీర్, డెవాల్ట్ బ్రెవిస్ 0 పరుగులకు అవుట్ అయిన వారిలో ఉన్నారు. కీలకమైన బ్యాటర్లు వెంట వెంటనే అవుట్ కావడంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. తక్కువ స్కోర్ కావడంతో రాజస్థాన్ కూడా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేదించింది. దీంతో ముంబై జట్టు వరుసగా మూడవ ఓటమిని నమోదు చేసింది.
ముంబై జట్టు ఓడిపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వైదికగా ముంబై జట్టు బ్యాటర్లు 0 పరుగులకు అవుట్ అయిన వీడియోలను తెగ సర్కులేట్ చేస్తున్నారు. ” గత రెండు సీజన్లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఈసారైనా జట్టు బాగా ఆడుతుంది అనుకుంటే 125 పరుగులు చేసి సొంత మైదానంలో చేతులెత్తేసింది. గొప్ప గొప్ప బ్యాటర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇలా అయితే ఎలా? ముంబై జట్టు యాజమాన్యం ఇప్పటికైనా ఆలోచించుకోవాలి” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ముగ్గురు బ్యాటర్లు 0 పరుగులకు అవుట్ కావడంతో ముంబై జట్టు పై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వినిపిస్తున్నాయి.
.@rajasthanroyals’ Lethal Start
They run through #MI’s top order courtesy Trent Boult & Nandre Burger
After 7 overs, it is 58/4
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL | #MIvRR pic.twitter.com/mEUocuD0EV
— IndianPremierLeague (@IPL) April 1, 2024