Nara Lokesh: టిడిపి యువ నేత నారా లోకేష్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రతను కేంద్రం కల్పించింది. దీనిని ఒక గొప్పగా టిడిపి నేతలు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నారు. భద్రత పెంచడంతో యువనేత ఒక స్థాయికి వెళ్లిపోయారని చెప్పుకొస్తున్నారు. ఆయన ఇంటి గుమ్మం నుంచి బయటకు రాగానే ఏకే 47 తుపాకులు పట్టుకుని ఉన్న నలుగురు ఆయనను ఫాలో అయ్యే చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది మా నాయకుడి ఘనత.. కేంద్రం అడిగిన వెంటనే భద్రత కల్పించిందని.. కేంద్ర ప్రభుత్వంతో మా నేతకు ఉన్న సన్నిహిత సంబంధానికి మచ్చుతునక ఇది అంటూ సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు హోరెత్తిస్తున్నారు.
అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేతకు ఈ స్థాయి భద్రత అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సామాన్యులు లోకేష్ కు దూరమయ్యే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. సాధారణంగా జట్ క్యాటగిరి లో ఉన్న నేతలకు సామాన్యులు కలుసుకోవడం అతి కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే గర్భగుడిలో దేవుడు లెక్కే. ఇటువంటి భద్రత ఎదుగుతున్న నాయకుడికి సరి కాదని కూడా తేల్చి చెబుతున్నారు. పార్టీ క్యాడర్ లోకేష్ ను కలవాలన్న ఇక కష్టమే. గతంలో లోకేష్ ను కలవాలంటే.. ఇట్టే పార్టీ శ్రేణులు కలిసేవారు. ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉన్నా.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి కావు. ఇకనుంచి అలా కుదరదు. ఇది తెలియక టిడిపి శ్రేణులు ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాయి.
జగన్ కాంగ్రెస్ ను విభేదించారు. సొంతంగా వైసీపీని ఏర్పాటు చేశారు. తన తన వెంట నడిచిన 12 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేశారు. తన తల్లితో పాటు తాను కూడా రాజీనామా బాట పట్టారు. ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. మంచి మెజారిటీతో విజయం సాధించగలిగారు.ఈ క్రమంలో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఎక్కువయ్యారు. ఆ సమయంలోనే తమ నాయకుడికి కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని ఓవైసీపీ నాయకుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కానీ దీనికి జగన్ తిరస్కరించారు. తనకు భద్రత అవసరం లేదని తిప్పి పంపారు. ఆ భద్రతతో ప్రజలతో మమేకం కాలేమని జగన్ ఆ నిర్ణయానికి వచ్చారు. కానీ ఇప్పుడు అదే భద్రతను లోకేష్ కోరుకోవడం ఇబ్బందికరంగా మారనుంది. నేరుగా ప్రజలను కలుసుకునే వీలుండదు. ఇది లోకేష్ కు జడ్ ప్లస్ కంటే మైనస్సే అధికమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The center has provided z plus security to nara lokesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com