Nita Ambani Laughing Video: ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్.. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు ఐపిఎల్ చరిత్రలోనే ఐదుసార్లు ట్రోఫీలు అందుకొని రికార్డ్ సృష్టించింది.. అటువంటి ముంబై జట్టు ప్రస్తుతం దారుణమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నది. గత సీజన్లో నాలుగో స్థానంలో ముంబై జట్టు.. ఈసారి మాత్రం గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది.. హార్దిక్ పాండ్యా నుంచి మొదలు పెడితే సూర్యకుమార్ యాదవ్ వరకు గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు అంతగా విజయాలు నమోదు చేయలేకపోయింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల మీద విమర్శలు పెరిగిపోయాయి. రోహిత్ ని పక్కన పెట్టి హార్థిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికీ ముంబై జట్టుకు ఉపయోగం లేకుండా పోయింది.
తాజాగా ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుక జరిగింది.. ఈ వేడుకకు చైర్ పర్సన్ హోదాలో నీతా అంబానీ హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి విద్యార్థి చేసిన ఒక ప్రసంగం ఆమెను నవ్వుల్లో ముంచెత్తింది. “మనకు ముంబై ఇండియన్స్ జట్టు అంటే చాలా ఇష్టం. ఆ చెట్టు ఇప్పుడు కఠినమైన సీజన్లను ఎదుర్కొంటున్నది. మన లైఫ్ లో కూడా అటువంటివే ఉంటాయని” అని ఆ స్టూడెంట్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ వేదిక మీద ఉన్న నీతా అంబానీ ఒక్కసారిగా పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వింది. ఆమె నవ్వుతుంటే మిగతావారు కూడా నవ్వడం మొదలుపెట్టారు.
ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది.. అయితే ఆ విద్యార్థి మాట్లాడిన మాటలను కొంతమంది సానుకూలంగా తీసుకుంటుండగా.. మరికొంతమంది వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమిస్తే ముంబై జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందని.. చివరికి ముంబై ఇండియన్స్ జట్టు ఒక విద్యార్థి మాట్లాడిన మాటలతో నవ్వులపాలైందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.. చాలామంది దీనిని ఒక హాస్య స్పూరకమైన సన్నివేశం లాగా తీసుకోవద్దని.. ఆ విద్యార్థి మాట్లాడిన మాటలు ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి గుణపాఠం లాంటివని.. ఇప్పటికైనా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్లో దారుణంగా ఆడింది.. అంతగా విజయాలు నమోదు చేయలేకపోయింది. జట్టులో ఐకమత్యం లోపించింది. కొంతమంది ఆటగాళ్లు వ్యక్తిగత ఈగోలకు పోయి సరిగ్గా ఆడలేదని ముంబై ఇండియన్స్ అభిమానులు పేర్కొంటున్నారు. అందువల్లే ఇలాంటి ఓటములు ఎదురయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ విద్యార్థి మాట్లాడిన మాటలను లెక్కలోకి తీసుకొని ఎం ఐ యాజమాన్యం మారాల్సిన అవసరం ఉందని వారు హితవు పలుకుతున్నారు.
అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఓ విద్యార్థి చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “మనకు ఇష్టమైన ముంబై ఇండియన్స్ (MI) జట్టు మాదిరిగానే జీవితంలోనూ కొన్నిసార్లు కఠినమైన సీజన్లు ఉంటాయి” అని ఆ విద్యార్థి వ్యాఖ్యానించడంతో అక్కడే ఉన్న నీతా అంబానీ నవ్వు… pic.twitter.com/q2hjVykkur
— ChotaNews App (@ChotaNewsApp) May 25, 2026
