Mukesh Ambani: ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు ముంబై జట్టు వరుస ఓటములు ఎదుర్కొన్నది. మున్ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే ఆ జట్టు పరిస్థితి బాగోలేదు. కీలకమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ ఆ జట్టు రాత మారడం లేదు. ఫలితంగా జట్టు ఆటగాళ్ల ఆట తీరుపై సోషల్ మీడియాలో పెద్ద పెట్టున విమర్శలు వినిపిస్తున్నాయి.. ముంబై జట్టు వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అంబానీ కుటుంబం మైదానంలో పెద్దగా సందడి చేయడం లేదు. ముంబై జట్టు ఆశించినంత స్థాయిలో ఆడకపోయినప్పటికీ ఆ జట్టు యజమాని నీతా అంబానీ భర్త ముకేశ్ అంబానీ ప్రేక్షకులకు సరికొత్త వరాలు ప్రకటించారు.
ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా దక్కించుకున్న నేపథ్యంలో.. ప్రేక్షకులకు మ్యాచ్ లను ఉచితంగా చూసే ఆఫర్ ప్రకటించింది. దానిని అమలు చేస్తోంది కూడా. అయితే ఇది సరిపోదు అన్నట్టుగా తన కస్టమర్లకు మరికొన్ని బంపర్ ఆఫర్లను ముఖేష్ అంబానీ ప్రకటించారు.. ఇందులో భాగంగా జియో ఐపీఎల్ 2024 అనే ఆఫర్ తీసుకొచ్చారు. ఈ 50 రోజులపాటు ఐపీఎల్ సీజన్లో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్లాన్ ను ప్రకటించారు. ఈ కొత్త ప్లాన్ జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఈ ఆఫర్ జియో ట్రూ 5 జీ కస్టమర్లకు అపరిమితమైన నెట్వర్క్ కవరేజ్ అందిస్తుంది. ఇందులో బిల్లింగ్ ప్లాన్ మార్చుకునే అవకాశాన్ని కస్టమర్లకు జియో అందిస్తోంది.
ఉదాహరణకు జియో కస్టమర్లు ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ బిల్లు సంవత్సరం ముందుగానే చెల్లిస్తే ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని జియో వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త ప్లాన్ తో 50 రోజులపాటు ఉచిత ఓచర్, హౌస్ సర్వీస్ పొందవచ్చు. బ్రాడ్ బ్యాండ్ ఇన్ స్టాల్ చేసిన వారంలో ఈ ఓచర్ క్రెడిట్ అవుతుంది. దీనివల్ల వినియోగదారులు 50 రోజుల తగ్గింపును పొందుతారు. అంతేకాదు అది సక్రమంగా వాడుకోకపోతే వచ్చే బిల్లింగ్ సైకిల్ లో ఈ ఆఫర్ ను సర్దుబాటు చేసుకోవచ్చు. తగ్గింపు ఓచర్ రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. “తన జట్టు ఓడిపోయినా ముఖేష్ అంబానీ జియో కస్టమర్ల కోసం అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జియో సినిమాలో ఉచితంగా ఐపిఎల్ చూసే అవకాశం కల్పించారు. పాపం ఆయన ఎన్ని త్యాగాలు చేసినా ముంబై జట్టు గెలవడం లేదు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.