Mahindra And Mahindra : భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. ప్రతీ కారు కంపెనీ ఓ కొత్త ఈవీని మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే టాటా మోటార్స్ తో పాటు పలు కంపెనీలు ఈవీలను రోడ్లపై తిప్పుతున్నాయి. ఇప్పుడు ప్రముఖ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా సైతం ఈవీని తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా XUV700ని EVగా మార్చి తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్, ఫొటోస్ లీక్ అయ్యాయి. దీంతో ఈ కారు కోసం కొందరు ఎదురుచూస్తున్నారు.
SUV కార్లను ఉత్పత్తి చేయడంలో మహీంద్రాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు Electrical Vehicle(EV)ల్లోనూ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఆన్ లైన్ లో లీక్ అయినా సమాచారం ప్రకారం సరికత్త ఎక్స్ యూవీ 700 ఈవీలో ఫుల్ విడ్సత్ ఎల్ ఈడీ లైట్స్, కొత్త బంపర్ ఉండనున్నాయి. కాపర్ కలర్డ్ యాక్సెంట్ స్పెషల్ బ్యాడ్జీలు అమర్చారు. దీని పొడవు 4740 ఎంఎం, వెడల్పు 1760 ఎంఎం ఉన్నాయి. ట్రిపుల్ ఇంటిగ్రేటేడ్ స్క్రీన్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు ఫ్రంట్ ప్యాసింజర్స్ కోసం ప్రత్యేకించి ఓ స్క్రీన్ ఉండనుంది.
ఎక్స్ యూవీ 8లో 60kWh-80kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఒక్కసారిగా ఛార్జింగ్ చేస్తే 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ ఈవీ వెర్షన్ ఐసీఈ మోడల్ ను పోలి ఉంటుంది. ఫలితంగా డెవలప్ మెంట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అతి త్వరలో దీనిని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మహీంద్రా కేవలం ఎక్స్ యూవీ 700 మాత్రమే కాకుండా మరిన్ని ఈవీలను తయారు చేస్తోంది.