https://oktelugu.com/

Nitin Gadkari: ఆ వాహనాలపై కేంద్రం గుడ్ న్యూస్

హైబ్రిడ్ వాహనాలపై 5 శాతం, ప్లెక్స్ ఇంజిన్ వాహానలపై 12 శాతం జీఎస్టీని తగ్గించే విధంగా ప్రణాళికలు వేస్తున్నామన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 2, 2024 4:15 pm
    Nitin Gadkari Car Interview

    Nitin Gadkari Car Interview

    Follow us on

    Nitin Gadkari: దేశంలో కాలుష్యంతో పాటు చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి నంచి తట్టుకోవడానికి రవాణా రంగం కొత్త మార్గాలను ప్రవేశపెడుతుంది. పెట్రోల్, డీజిల్ కార్ల వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్, బయోడీజిల్ కార్లను తీసుకొస్తుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసి వినియోగదారుల ముందుకు తీసుకొచ్చాయి.టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవాను బయోడీజిల్ కారును లాంచ్ చేసింది. అయితే తాజాగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించేందకు కేంద్ర రవాణాశాఖ మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీటికి జీఎస్టీని తగ్గిస్తామని ఆయన తెలిపారు.

    కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో కార్ల ఉత్పత్తులపై కొన్ని విషయాలను వెల్లడించారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో భారత్ లో పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి పూర్తిగా విముక్తి చెంది ఈవీ, బయో డీజిల్ వాహనాలను ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రోత్సకాలు అందిస్తామని అన్నారు.

    దేశంలో 36 కోట్ల వాహనాలు ున్నాయి. ఇవి ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ఫ్యూయెల్ కలిగినవి. వీటి నుంచి విముక్తి కావడం సాధ్యం కాకపోవచ్చు. కానీ అసాధ్యమైతే కాదని అన్నారు. ప్రస్తుతం ఇంధన దిగుమతులను రూ.16 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. అయితే హైబ్రిడ్, ఈవీలను ప్రోత్సహించడం ద్వారా దిగుమతులకు అయ్యే ఖర్చు డబ్బు మిగులుతుందని, ఆ డబ్బును రైతుల కోసం ఉపయోగిస్తామని అన్నారు.

    అలాగే ఈ ఈవీ, హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించే విధంగా ఇప్పటికే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. హైబ్రిడ్ వాహనాలపై 5 శాతం, ప్లెక్స్ ఇంజిన్ వాహానలపై 12 శాతం జీఎస్టీని తగ్గించే విధంగా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. 2004 నుంచే పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ రహిత వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఈ మార్పులు రానున్న రోజులు సాధ్యం చేస్తామని ఆయన అన్నారు.