Crime News : భార్య చేతిలో దెబ్బలు, ఒంటిమీద వాతలు.. భర్తలు బతికే రోజులు కావివి

తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసిన అనంతరం.. అతడి భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. భార్యాభర్తలిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

Written By: NARESH, Updated On : April 19, 2024 10:57 pm

-husband-wife-fight

Follow us on

Crime News సంసారం అన్నాక భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. కొందరు వీటిని సులభంగా తీసుకుంటారు. మరి కొందరు కఠినంగా తీసుకుంటారు. సర్దుకుపోయే తత్వం ఉంటే ఆ కాపురం బాగుంటుంది. లేకుంటే ఫ్యామిలీ సర్కస్ సినిమా లాగా ఉంటుంది. కాకపోతే కొందరు దంపతులు ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు. చేతికి అందిన వస్తువులను విసిరేసుకుంటారు. భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తే భార్య అలిగి కూర్చుంటుంది. వంట చేయకుండా మౌన దీక్ష చేస్తుంది. ఇంకా కొంతమంది భార్యలైతే అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంటారు. కొద్దిరోజులు చూసిన తర్వాత భర్త ఆమెను బతిలాడి మళ్ళీ తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇక భార్య కోప్పడితే భర్తలు అలుగుతారు. వారు పుట్టింటికి వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి.. స్నేహితులతో చెప్పుకొని బాధపడుతుంటారు. లేకుంటే వైన్ షాపుకు వెళ్లి సాంత్వన పొందుతుంటారు. కొన్నిసార్లు తాగిన మందు ఎక్కువైతే ఇంట్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తారు. కానీ మీరు చదవబోయే ఈ కథనం పూర్తి డిఫరెంట్.

అతడి పేరు నాగేష్.. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతడు కుటుంబంతో కలిసి కొంపల్లిలో నివాసం ఉంటాడు. అయితే కొంతకాలంగా నాగేష్ ను అతని భార్య కొడుతోంది. కొట్టడం మాత్రమే కాదు ఒంటిమీద వాతలు కూడా పెడుతోంది. ఇద్దరు పిల్లలకు “మీ నాన్న చనిపోయాడని” చెబుతోంది. గొడవ పడినప్పుడల్లా “నువ్వు చచ్చిపో” అంటూ హేళనగా మాట్లాడుతోంది. దీంతో నాగేష్ ఆత్మ న్యూనత కు గురయ్యాడు. కొంపల్లిలోని జయభేరి పార్క్ చెరువులో దిగి ఆత్మహత్యకు యత్నించాడు.. దీంతో స్థానికులు అతడిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని బయటకు తీశారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. నాగేష్ బోరున విలపించాడు. ” భార్యను తిడుతోంది. దారుణంగా కొడుతోంది. పిల్లలను దగ్గరకు రానివ్వడం లేదు. నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. ఒంటిపై వాతలు కూడా పెడుతుంది. చనిపో అంటూ తిడుతోంది. అందువల్లే నా సమస్యకు పరిష్కారం మార్గంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాని” నాగేష్ తన బాధను చెప్పుకున్నాడు. తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసిన అనంతరం.. అతడి భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. భార్యాభర్తలిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.