MS Dhoni: సాధారణంగా యుద్ధంలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు దేశ రక్షణ కోసం సైన్యం మాత్రమే కాకుండా టెరిటోరియల్ ఆర్మీ కూడా అందులో పాల్గొంటుంది. ప్రతి దేశానికి సైన్యంతో పాటు టెరిటోరియల్ ఆర్మీ కూడా ఉంటుంది. యుద్ధంలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆర్మీకి సహకరించడానికి టెరిటోరియల్ ఆర్మీ ఉపయోగపడుతుంది. ఇక మన దేశానికి సంబంధించి ప్రాదేశిక సైన్యం లో ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇందులో క్రికెటర్లు.. రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.. మహేంద్ర సింగ్ ధోనీకి ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉంది. మహేంద్ర సింగ్ ధోని 2011లో మన దేశ సైన్యం తరఫున ప్రాదేశిక సైన్యంలో పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ బిరుదు లభించింది. నాడు మహేంద్ర సింగ్ ధోని సైన్యంతో రెండు వారాలపాటు శిక్షణ పొందారు.. 2019లో కాశ్మీర్లోని 109 ప్రాదేశిక సైన్యంలో ట్రైనింగ్ తీసుకున్నారు. సైన్యంతో కలిసి అనేక పనులు చేశారు. బంక్, వాచర్ డ్యూటీ చేశారు.
Also Read: ఒక్క నిమిషంలో ఆరు అబద్ధాలు చెప్పిన పాక్.. వీడియో వైరల్
ఇప్పుడు వెళ్తారా?
ప్రస్తుతం ధోని వయసు 43 సంవత్సరాలు. ఆయనప్పటికీ ఆయన విపరీతమైన యాక్టివ్ గా ఉన్నారు. గతంలో ఆయన ప్రాదేశిక సైన్యంలో పనిచేశారు. టీమిండియా కు, అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలికిన తర్వాత ధోని ప్రాదేశిక సైన్యంలో చేరిపోయారు. దేశ ఆర్మీకి పనిచేయాలనే కోరికను ఆయన నెరవేర్చుకున్నారు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ధోని ప్రాదేశిక సైన్యంలో పని చేయడానికి వెళ్తారా? ఒకవేళ ఆర్మీ నుంచి గనుక పిలుపు వస్తే ఆయన ఆ సాహసానికి పాల్పడతారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితిలో.. మన దేశం కోసం ప్రాదేశిక సైన్యం ద్వారా పనిచేయాలి అని పిలుపు వస్తే.. కచ్చితంగా ధోని వెళ్తారని.. అందులో ఏమాత్రం అనుమానం లేదని అతని అభిమానులు అంటున్నారు.” దేశం అంటే ధోనీకి చాలా ఇష్టం. సైన్యంలో పనిచేయాలంటే కూడా అతడు ఆసక్తి చూపిస్తుంటాడు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ ధోని తనవంతుగా దేశం కోసం సేవ చేస్తూనే ఉంటాడు. సేవ చేయాలని పరితపిస్తూనే ఉంటాడు. దేశం కోసం జీవించడంలో.. దేశం కోసం పనిచేయడంలో ఆనందాన్ని ధోని వెతుక్కుంటాడని” అతని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ప్రాదేశిక సైన్యం పేరు వినిపించగానే.. ధోని గురించి మీడియాలో చర్చ జరుగుతుంది. గతంలో అతడు పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడని కొంతమంది ఫోటోలు స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే అందులో వాస్తవం లేదని.. గతంలో ఆర్మీలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు తీసిన ఫోటోలు అని.. ధోని అభిమానులు స్పష్టత ఇస్తున్నారు.