MS Dhoni Love Story: భారత క్రికెట్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ గా పేరుగాంచాడు. ఆటలో తనదైన శైలిలో ప్రత్యర్థి జట్టును డైలమాలో పడేయడంలో ఆయనది అందెవేసిన చేయి. అందరిని మెప్పించడంలో కూడా అతడిది ఓ ప్రత్యేకత. దాదాపు పదహారేళ్లు టీమిండియా కెప్టెన్ గా కొనసాగాడు. అతడి పెళ్లి మాత్రం ఓ విచిత్రంగా జరిగింది. సినిమాలోలా లవ్ స్టోరీ సాగలేదు. కానీ విచిత్రంగా చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆటలోనే కాదు జీవితంలో కూడా ట్విస్ట్ ఇచ్చాడు.
ధోని కుటుంబం అతడి భార్య సాక్షి సింగ్ కుటుంబం పరస్పరం స్నేహంతో మెలిగేవారు. దీంతో ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుకునే వారు. వారి కుటుంబ సభ్యులు వీరి కుటుంబ సభ్యులు విందులు, వినోదాల్లో పాల్గొనేవారు. కానీ కొద్ది కాలానికి సాక్షి కుటుంబం డెహ్రాడూన్ వెళ్లింది. ఆమె చదువు కూడా అక్కడే కొనసాగింది. తరువాత బెంగాల్ వెళ్లారు ఇలా తిరగడం వల్ల వారు కొంత కాలం దూరం కావాల్సి వచ్చింది. దీంతో ధోని పాకిస్తాన్ తో బెంగాల్ లో మ్యాచ్ ఆడే సమయంలో సాక్షి అక్కడకు చేరుకుంది.
Also Read: Electric Meters Agricultural Pump Sets: ఏపీ సర్కారుకు షాకిచ్చిన కేంద్రం.. జగన్ నిండా మునిగాడా?
సాక్షి ని తొలిచూపులోనే ఇష్టపడిన ధోని జట్టు మేనేజర్ ద్వారా ఆమె నెంబర్ సంపాదించి ఆమెకు మెసేజ్ చేశాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. రెండు నెలల తర్వాత ధోని పుట్టిన రోజు వేడుకకు సాక్షి హాజరైంది. దీంతో ఆమెని బైక్ పై ఇంటిదగ్గర దించిన ధోని తన లవ్ ను ప్రపోజ్ చేశాడు. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. చాలా సమయమే తీసుకున్నా ఎట్టకేలకు మాత్రం ఓకే చెప్పింది. దీంతో వారి వివాహం జులై 4,2010లో జరిగింది. వారి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది.
ధోనీ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండడు. దీంతో అతడి వ్యవహారాలన్ని సాక్షినే చూసుకుంటుంది. అభిమానులతో ధోని అభిప్రాయాలు షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సాక్షి ధోని విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. వీరి ప్రేమకు గుర్తుగా జీవా పుట్టింది. దీంతో ఆమె వారి లోకం అవుతోంది. ధోని సాక్షి జంట సోషల్ మీడియాలో ఎప్పుడు సందడిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. మిస్టర్ కూల్ గా ధోని ఎన్నో విజయాలు సొంతం చేసుకుని వరల్డ్ కప్ ను సాధించిన ఘనత ఆయన సొంతం కావడం గమనార్హం.