Director Parasuram: సాధారణంగా ఒక స్టార్ హీరో తో సూపర్ హిట్ సినిమా తీస్తే ఆ డైరెక్టర్ కి మంచి డిమాండ్ రావడం అనేది సర్వసాధారణం..కానీ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో మంచి సూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత కూడా సరైన ఆఫర్స్ రాబట్టలేక చతికిలపడుతున్నాడు ఒక డైరెక్టర్..ఆయన మరెవరో కాదు..ఇటీవలే మహేష్ బాబు తో సూపర్ హిట్ సినిమాని తీసిన సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ పెట్ల..విజయ్ దేవరకొండ తో గీత గోవిందం లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తీసి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు పరశురామ్..ఈ సినిమాని ఆయన తీర్చి దిద్దిన విధానం ని నచ్చే మహేష్ అతనికి పిలిచిమరీ అవకాశం ఇచ్చాడు..కానీ ఆయన ఆశించిన స్థాయిలో సర్కారు వారి పాట సినిమాని తియ్యలేకపొయ్యాడు..మహేష్ బాబు స్టామినా వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టగలిగింది కానీ..డైరెక్టర్ గా పరుశురాం పెట్ల కి ఇది ఒక ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు..మహేష్ కూడా చెప్పిన కథ ఒకటి తీసిన విధానం ఒకటి అంటూ సర్కారు వారి పాట సినిమా విషయం లో చాలా గుర్రుగా ఉన్నాడట.
Also Read: Kishan Reddy- Pawan Kalyan: కిషన్ రెడ్డి పిలిచినా పవన్ వెళ్లలేదా? కారణమేంటి?
ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగ చైతన్య తో పరశురామ్ ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ ప్రాజెక్ట్ గురించి నాగ చైతన్య నుండి ఎలాంటి పిలుపు కూడా ఇప్పటి వరుకు పరశురామ్ కి రాలేదట..సర్కారు వారి పాట టేకింగ్ ని చూసిన తర్వాత నెమ్మదిగా పరశురామ్ నుండి నాగ చైతన్య తప్పుకున్నాడని సోషల్ మీడియా లో వినిపిస్తుంది..గీత గోవిందం సినిమా తో క్రేజీ డైరెక్టర్ గా మారిన పరశురామ్..ఆ తర్వాత మీడియం రేంజ్ హీరో తో సినిమా తీసి బాగుండేది..కానీ ఒక్కేసారి మహేష్ బాబు లాంటి స్టార్ తో సినిమా ఛాన్స్ వచ్చింది..స్టార్ హీరో ని డీల్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు..అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి..డైరెక్టర్ ఎలా ఆ అంచనాలను అందుకోవాలి అనే దానిపైనే ద్రుష్టి ఉంటుంది కానీ..స్క్రిప్ట్ మీద ఉండదు..ఫాన్స్ డిమాండ్ మేరకు కొన్ని ఎలేవేషన్ సన్నివేశాలు..ఫైట్ సీన్స్ పెట్టాల్సి ఉంటుంది..ఇలా చెయ్యడం వల్లే సినిమా కథలో ఉన్న బలం తగ్గిపోతుంది..ప్రేక్షకులకు చెప్పాలనుకున్న విధానం మారిపోయాయి ఫలితం తారుమారు అవుతుంది..సర్కారు వారి పాట సినిమా కి అదే జరిగింది..కథాంశం ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే రేంజ్..కానీ ట్రీట్మెంట్ సరిగా లేదు..అందుకే కంటెంట్ పరంగా సర్కారు వారి పాట యావరేజి అనిపించింది..అంతే కాకుండా పరశురామ్ తో సినిమా చెయ్యాలంటే ఏ హీరో అయినా ఆలోచించేలా చేసింది..మరి పరశురామ్ కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read: Rajyasabha: నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి నలుగురు.. రాజమౌళి తండ్రికి రాజ్యసభ ఇచ్చిన మోడీ