Allu Arjun And Atlee Movie: ‘పుష్ప 2’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో మొదలు పెట్టిన సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ 40 శాతం కి పైగా పూర్తి అయ్యిందట. కానీ ఈ చిత్రం అత్యధిక శాతం VFX మీద ఆధారపడి ఉండడం తో, కేవలం VFX వర్క్ కోసమే ఏడాది కి పైగా సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తెరకెక్కిన ఔట్పుట్ ని రీసెంట్ గానే అల్లు అర్జున్ చూశాడట. ఆయన కొన్ని సన్నివేశాలకు అసంతృప్తి వ్యక్తం చేసాడని, ఆ సన్నివేశాలను మరోసారి రీ షూట్ చేస్తే బాగుంటుందని అన్నదాత అల్లు అర్జున్.
నిర్మాత కూడా రీ షూటింగ్ కి బడ్జెట్ ని కేటాయించడానికి రెడీ అవ్వడం తో, వచ్చే వారం లో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రం లో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక క్యారక్టర్ నెగిటివ్ షేడ్స్ లో ఉండబోతుంది . ఈ చిత్రం లో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. అల్లు అర్జున్, దీపికా కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సినిమాలో దీపికా తో పాటు మృణాల్ ఠాకూర్ , జాన్వీ కపూర్ లు కూడా హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం మెయిన్ విలన్ గా రష్మిక మందాన నటించబోతున్నట్టు సమాచారం. ఇంత కాలం హీరోయిన్ రోల్స్ తో అలరిస్తూ వచ్చిన రష్మిక, ఇప్పుడు పూర్తి స్థాయి విలన్ క్యారక్టర్ లో కనిపించనుంది. ‘పుష్ప’సిరీస్ లో అల్లు అర్జున సరసన హీరోయిన్ గా నటించి ది బెస్ట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రష్మిక, ఇప్పుడు అదే అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా నటించబోతుండడం గమనార్హం. చూడాలి మరి ఆమెలోని ఈ షేడ్ లో ఆమె ఎలా అలరించబోతుంది అనేది.