Spirit Movie Update: ప్రభాస్(Rebel Star Prabhas) లైనప్ లో ప్రస్తుతం చాలా సినిమాలే ఉన్నాయి. అందులో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). సందీప్ వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇచ్చే థియేట్రికల్ అనుభూతి ఊహలకు అందని విధంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. సందీప్ వంగ గత చిత్రాలను చూస్తే, ఆయన తన హీరోలను ఎంత పవర్ ఫుల్ గా, బోల్డ్ గా, వయొలెంట్ గా చూపిస్తాడో తెలుసుకున్నాం. ఇలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుందో అని ఒకప్పుడు కేవలం ఊహించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఊహలు నిజం అవుతున్నాయి. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ లో ప్రభాస్ పై జైలు సన్నివేశాలను చిత్రీకరించారు. నాలుగు రోజుల పాటు ఆయన ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు.
ఇప్పుడు రెండవ షెడ్యూల్ కోసం సందీప్ వంగ 200 మంది ఫైటర్స్ ని సిద్ధం చేస్తున్నాడట. అందుకోసం హైదరాబాద్ లో ఆయన ఒక భారీ సెట్ ని కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. సాధారణంగా సందీప్ వంగ సినిమాల్లో భారీ సెట్స్ ఉండవు. చాలా నేచురల్ గా సన్నివేశాలను తెరకెక్కిస్తుంటాడు. అలాంటి సందీప్ వంగ కి కూడా ఇప్పుడు సెట్స్ అవసరం అయ్యాయి అంటే, ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. 200 మందితో, సందీప్ వంగ మార్క్ టేకింగ్ తో ప్రభాస్ ఫైటింగ్ చేస్తుంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. అభిమానుల కల ఇది. ఆ కల రేపు వెండితెర పై కనిపిస్తే ఎన్ని రికార్డ్స్ బద్దలు అవుతాయో చూడాలి. సాధ్యమైనంత వరకు ఈ సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది చివరి లోపే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు డైరెక్టర్ సందీప్.
ఈ సినిమా కోసం ప్రభాస్ 80 రోజుల పాటు పని చేయనున్నాడు. సందీప్ వంగ తన సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా సమయం తీసుకుంటూ ఉంటాడు. ఈ సినిమాకు కూడా అలా భారీ గా టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అనుకున్నవన్నీ పర్ఫెక్ట్ గా జరిగితే ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా, హీరోయిన్ గా త్రిప్తి దిమిరి నటిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రం లో ఒక స్పెషల్ క్యామియో రోల్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద టాక్ నడుస్తోంది. డైరెక్టర్ సందీప్ వంగ అయితే ఈ అంశాన్ని సర్ప్రైజ్ గానే ఉంచాడు.