https://oktelugu.com/

NZ Vs ENG: ఒకప్పుడు సెంచరీల వీరుడు.. ఇప్పుడు సున్నాల యోధుడు.. ఇంగ్లాండ్ ఆటగాడి చెత్త రికార్డు..

ఒకప్పుడు అతడు మైదానంలోకి అడుగుపెడితే చాలు పరుగుల వరద పారేది. ప్రత్యర్థి బౌలర్లకు నైరాశ్యం మిగిలేది. సెంచరీల మీద సెంచరీలు చేసినా అతడికి అలసట రాకపోయేది. అందువల్లే అతడు ఆడుతున్న జట్టు "బజ్ బాల్" ను టెస్ట్ క్రికెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే అలాంటి ఆటగాడు ఇప్పుడు తేలిపోతున్నాడు. అతడు మరెవరో కాదు.. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 29, 2024 / 11:09 AM IST

    NZ Vs ENG

    Follow us on

    NZ Vs ENG: గతంలో టెస్ట్ క్రికెట్లో విధ్వంసాన్ని సృష్టించిన రూట్.. ఇప్పుడు తేలిపోతున్నాడు. దారుణమైన ఆట తీరుతో విమర్శల పాలవుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్టులో 262 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతడు తన చివరి ఐదు ఇన్నింగ్స్ లలో 90 పరుగులు మాత్రమే చేశారంటే బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా.. క్రైస్ట్ చర్చ్ వేదికగా మొదలైన తొలి టెస్ట్ లో ముందుగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో 348 పరుగులు చేసింది. విలియం సన్ 93, ఫిలిప్స్ 58*, లాతమ్ 47, రచిన్ రవీంద్ర 34 పరుగులు చేశారు. బ్రైడెన్ కార్సే, షోయబ్ బషీర్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

    అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మ్యాట్ హెన్రీ ధాటికి తొమ్మిది పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాక్ క్రావ్ లే (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్(46) దూకుడుగా ఆడినప్పటికీ.. వేగంగా పరుగులు తీసే క్రమంలో అవుట్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ జాకోబ్ బేతల్(10) నిరాశపరచాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన జో రూట్(0) గోల్డెన్ డక్ గా ఔటయ్యాడు. నాథన్ స్మిత్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే నిరాశ పరుస్తూ.. సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు.. తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్(116 బ్యాటింగ్), ఓలి పోప్(77) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కాస్తలో కాస్త కుదురుకుంది. సెంచరీ దిశగా వెళ్తున్న పోప్ అవుట్ కావడంతో.. కెప్టెన్ బెన్ స్టాక్స్ (17*) మైదానం లోకి వచ్చాడు..

    గోల్డెన్ డక్ లలో రికార్డ్

    నాథన్ స్మిత్ బౌలింగ్లో అవుట్ అవ్వడం ద్వారా టెస్ట్ క్రికెట్లో 13వ సారి గోల్డెన్ డక్ గా రూట్ అవుట్ అయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అతడు ఎనిమిదో సారి గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ లో ఎక్కువసార్లు గోల్డెన్ డక్ గా అవుట్ పైన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ సార్లు గోల్డెన్ డక్ గా ఔటయ్యారు. ఇప్పుడు వారి రికార్డును రూట్ అధిగమించాడు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 348 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం ఐదు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.. ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది.