Mohammed Shami : గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో మహమ్మద్ షమీ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు. స్పిన్ బౌలర్లు పండగ చేసుకుంటారని భావించిన మైదానంపై తన పరాక్రమాన్ని చూపించాడు. ఐదు వికెట్ల ఘనతతో పాటు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలలో 200 వికెట్ల క్లబ్ లోకి మహమ్మద్ షమీ అడుగు పెట్టాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సౌమ్య సర్కార్, మెహది హసన్, మిరాజ్, జాకీర్ అలీ వికెట్లను పడగొట్టాడు. అంతేకాదు వన్డేలలో ఇన్నింగ్స్ ల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన భారతీయ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక ఇదే సమయంలో జహీర్ ఖాన్ రికార్డులను బద్దలు కొట్టాడు. అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్ లలో 200 వికెట్లను పడగొట్టాడు. అయితే మహమ్మద్ షమీ 103 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు సృష్టించాడు.
ఇన్నింగ్స్ ల పరంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..
మహమ్మద్ షమీ 103, అజిత్ అగార్కర్ 133, జహీర్ ఖాన్ 144, అనిల్ కుంబ్లే 147, జవగల్ శ్రీనాథ్ 147, కపిల్ దేవ్ 166 ఇన్నింగ్స్ లలో 2వతులు వికెట్లు పడగొట్టారు. ఇక మొత్తంగా చూసుకుంటే వన్డేలలో అత్యంత వేగంగా 200 వికెట్లను పడగొట్టిన బౌలర్లలో రెండవ వాడిగా మహమ్మద్ షమీ నిలిచాడు. ఈ క్రమంలోనే అతడు పాకిస్తాన్ లెజెండరీ ఆటగాడు సక్లయిన్ ముస్తాక్ రికార్డును ఈక్వల్ చేశాడు. ముస్తాక్, షమీ 104 మ్యాచ్ లలో ఈ మైలురాయిని అందుకున్నారు.. అయితే ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 102 వన్ డే లోనే ఈ రికార్డును సృష్టించాడు.
వన్డేలలో అత్యంత వేగంగా..
వన్డేలలో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లలో స్టార్క్ మొదటి స్థానంలో ఉన్నాడు. 102 వన్డేలలో అతడు ఈ రికార్డు సృష్టించాడు. సక్లైన్ ముస్తాక్ 104 వన్డే లలో 200 వికెట్లను పడగొట్టాడు. మహమ్మద్ షమీ 104 మ్యాచ్లలో 200 వికెట్ల రికార్డును సృష్టించాడు. బౌల్ట్ 107, బ్రెట్ లీ 112, ఆలెన్ డోనాల్డ్ 117 వన్డేలలో 200 వికెట్లను పడగొట్టారు. బంతుల పరంగా చూసుకుంటే వన్డేలలో మహమ్మద్ షమీ అత్యంత వేగంగా 200 వికెట్లను తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ ను అధిగమించాడు. 5420 బంతులలో స్టార్క్ ఈ రికార్డును సృష్టించగా.. 5126 బంతుల్లోనే షమీ ఈ ఘనత అందుకున్నాడు. వీరిద్దరి తర్వాత ముస్తాక్, బ్రెట్ లీ ఉన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మహమ్మద్ షమీ ఏడవ స్థానంలో ఉన్నాడు.. అనిల్ కుంబ్లే 334, జవగల్ శ్రీనాథ్ 315, అజిత్ అగార్కర్ 288, జహీర్ ఖాన్ 269, హర్భజన్ సింగ్ 265, కపిల్ దేవ్ 253, రవీంద్ర జడేజా 226*, మహమ్మద్ షమీ 202* వికెట్లు తీశారు.