GV Prakash-Saindhavi : కోలీవుడ్ యంగ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తను ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) గత కొంత కాలంగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తున్నారు. ఆయన తన భార్య సైంధవికి డివోర్స్ ఇవ్వడం ఇండస్ట్రీతో పాటు సాధారణ జనాల్లో కూడా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయన మరో హీరోయిన్ తో డేటింగ్ చేయడం వల్ల, తన భార్యకు విడాకులు ఇచ్చాడన్న రూమర్స్ గుప్పుమంటున్నాయి. తాజాగా జీవీ ప్రకాష్ తో పాటు ఆ డేటింగ్ హీరోయిన్ కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం జీవి ప్రకాష్, దివ్యభారతితో కలిసి ‘కింగ్‌స్టన్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా జీవీ ప్రకాశ్ డివోర్స్ ను ఉద్దేశించి దివ్యభారతి కీలక విషయాలు చెప్పుకొచ్చారు. జీవీ ప్రకాశ్ – సైంధవి దంపతులు డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో తనని ఎంతో విమర్శించారని అన్నారు. వారు విడిపోవడానికి తానే కారణమంటూ ప్రచారం జరిగిందన్నారు.
ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. జీవీ ప్రకాష్, నేను బ్యాచిలర్ అనే సినిమాకు కలిసి పనిచేశాము. ఆ సినిమాలో మా జంట కెమిస్ట్రీకి మంచి ఆదరణ దక్కింది. ఆ సినిమా చూసి మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నామంటూ చాలా మంది తప్పుగా అనుకున్నారు. గతేడాది జీవీ ప్రకాశ్ – సైంధవి డివోర్స్ ప్రకటించిన సమయంలో ఎంతోమంది నాకు మెసేజ్లు పంపారు. వారు విడిపోవడానికి కారణం నేనేనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. విడాకుల తర్వాత కూడా వాళ్లిద్దరూ కలిసి ఒక కాన్సర్ట్ నిర్వహించారు. ఆ విషయం తెలిసి హ్యాపీగా ఫీలయ్యా. ఇకపై నాకు ఇలాంటి మెసేజ్ లు రావనుకున్నా. కానీ పరిస్థితి తల్లకిందులైంది. నాపై విమర్శలు మరింత ఉధృతం అయ్యాయి. నన్ను ఏకపక్షంగా తిడుతూ మహిళలే ఎక్కువ మంది మెసేజ్‌లు పెట్టారు. వాటిని జీవికి పంపేదాన్ని. ఆయన ఇలాంటివి పట్టించుకోకు కెరీర్‌పై దృష్టి పెట్టు అంటూ ఆయన రిప్లై ఇచ్చారని దివ్య భారతి చెప్పుకొచ్చారు.
ఇదే విషయం పై జీవీ కూడా స్పందించారు. మేమిద్దరం డేటింగ్ చేయడం లేదన్నారు. కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టంచేశారు. తనను కేవలం సెట్స్ లో మాత్రమే కలిశానన్నారు. ఇక ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్న టైంలో ఇలా కలిశానని చెప్పుకొచ్చారు. తనను బయట ఒక్కసారి కూడా కలవలేదని చెప్పాడు. గతంలో నటించిన బ్యాచిలర్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అందులో మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. కాబట్టి, ఇలాంటి రూమర్స్ కామన్ అంటూ జీవి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ‘కింగ్‌స్టన్’ అనే సినిమాతో మార్చి 7న థియేటర్లలోకి రాబోతున్నారు.
#GVPrakash: Many People are talking like me & DivyaBharathi are dating each other. We are normal friends & we don’t even meet outside the floors#DivyaBharathi: I used to get messages like I’m the reason behind GVPrakash’s separation of marriage life pic.twitter.com/SrM86jYxKo
— AmuthaBharathi (@CinemaWithAB) February 20, 2025